న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్ విజేత ముర్రే, బ్రిటన్ ఆటగాడిగా రికార్డు

By Pratap
Andy Murray
న్యూయార్క్: బ్రిటన్ క్రీడా చరిత్రలో ఆండీ ముర్రే కొత్త అధ్యాయం సృష్టించాడు. 76 ఏళ్ల ఏళ్ల తర్వాత ఓ బ్రిటన్ ఆటగాడు పురుషుల గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారుడిగా అతను రికార్డు సృష్టించాడు. హోరాహోరీ జరిగిన పోరులో ఆండీ ముర్రే 2011 విజేత నోవాక్ జకోవిచ్‌ను 7-6, 7-5, 2-6, 3-6, 6-2 స్కోరుతో ఓడించి కొత్త అధ్యాయానికి తెర తీశాడు.

బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్ పెర్రీ 1936లో మూడో అమెరికా టైటిల్ సాధించాడు. అదే ఏడాది స్పెయిన్ అంతర్యుద్ధం ముగిసి ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. తుది సెట్‌లో పాతికేళ్ల ముర్రే కత్తిలా దూసుకుపోయాడు.

ముర్రే, జకోవిచ్ మధ్య యుఎస్ పురుషుల ఓపెన్ సింగిల్స్ పైనల్ పోరు సుదీర్ఘంగా సాగింది. తొలి రెండు సెట్లు గెలిచిన ముర్రేకు జకోవిచ్ తర్వాతి రెండు సెట్లు గెలిచి సవాల్ విసిరాడు. ఆ తర్వాత తుది సెట్‌లో ముర్రే విజృంభించి జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. నాలుగు గంటల 54 నిమిషాల పాటు పోరు ఉత్కంఠ భరితంగా సాగింది.

ముర్రే గత నాలుగు గ్రాండ్ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. 2008 యుఎస్ ఓపెన్‌లో, 2010 ఆస్ట్రేలియా ఓపెన్‌లో, ఈ ఏడాది వింబుల్డన్‌లో రోజర్ ఫెదరర్‌పై , 2011 ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌పై ముర్రే ఓటమి పాలయ్యాడు. తుది సెట్‌ ఉత్కంఠభరితంగా సాగింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X