
రాయల్ ఆర్టిలరీ బరాక్స్‌లో జరిగిన 10మీ రైఫిల్ షూటింగ్‌లో మొదటి స్దానాన్ని ఇటలీకి చెందిన నికోలో సాధించగా.. రెండవ స్దానాన్ని రొమేనియాకు చెందిన అలిన్ జార్జీ సొంతం చేసుకున్నాడు. ఇక గగన్ నారంగ్ విషయానికి వస్తే 53 ఇన్నర్ షాట్స్ కొట్టగా.. అభినవ్ బింద్రా 45 ఇన్నర్ షాట్స్ కొట్టాడు. భారత్ నుంచి షూటింగ్‌లో తొలిసారి 11 మంది బరిలోకి దిగారు. 2008 బీజింగ్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన అభినవ్ బింద్రా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. క్వాలిఫికేషన్ రౌండ్ లోనే ఇంటి దారి పట్టాడు. ఆంధ్రప్రదేశ్ మేటి షూటర్ గగన్ నారంగ్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
అంతక ముందు మీడియాతో మాట్లాడిన గగన్ నారంగ్ గత ఒలింపిక్స్‌లో సాధించలేనిది ఈ సారి తప్పకుండా సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఈ సందర్బంలో నారంగ్ మాట్లాడుతూ సాదారణంగా టెన్నిస్, స్విమ్మింగ్ లో మాదిరి షూటింగ్‌లో ఫేవరేట్స్ ఉండరు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్దానంలో నిలిచిన వారికి, చివరి స్దానంలో నిలిచిన వారికి కేవలం కొద్ది పాయింట్లు తేడా మాత్రమే ఉంటుందన్నాడు. 10మీ. ఎయిర్ రైఫిల్ తోపాటు గగన్ 50మీ. రైఫిల్ ప్రోన్ (ఆగస్టు3), 50మీ. రైఫిల్ 3 పొజిషన్ (ఆగస్టు 6)లోనూ పాల్గొంటున్నందున ఏదో పతకం వస్తుందని ఆశిస్తున్నాడు.
10మీ రైఫిల్ షూటింగ్ ఫైనల్: సాయంత్రం 4.45 నిమిషాలకు
తెలుగు వన్ఇండియా