Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాత్రంతా రోడ్డుపైనే: వీసా కోసం ప్రత్యేక అథ్లెట్లు

న్యూఢిల్లీ: పెద్దగా ప్రేక్షకాదరణ లేని, అసలు విషయం చెప్పాలంటే ఆర్థికంగా లాభసాటికాని క్రీడాంశాలకు భారత్‌లో ఎలాంటి దుస్థితి ఉంటుందన్నది ఈ ఘటన గమనిస్తే తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రత్యేక అథ్లెట్లను (వికలాంగ క్రీడాకారులు) అతి నిర్లక్ష్యానికి గురి చేసిన ఉదంతమిది.

చైనీస్‌తైపీ వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఆసియా, పసిఫిక్ బధిరుల క్రీడల్లో పాల్గొనేందుకు గురువారం వీసా కోసం దరఖాస్తు చేసుకున్న భారత అథ్లెట్లు.. సాంకేతిక సమస్యలతో వీసా జారీ ఆలస్యమవడంతో రోడ్డుపైనే నిద్రించాల్సిన పరిస్థితి తలెత్తింది.

వీరి బాగోగులు చూసుకోవాల్సిన అఖిల భారత బధిరుల క్రీడా మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించి వసతి కూడా ఏర్పాటు చేయకపోవడంతో అథ్లెట్లకు ప్రత్యక్ష నరకం చూశారు.

Special athletes spend night on road, Ministry orders probe

ఎట్టకేలకు వీసా శుక్రవారం లభించినా, శనివారమే టోర్నీ మొదలవనుండడంతో మానసికంగా ఎంతమంది అథ్లెట్లు ఈ పోటీలకు సన్నద్ధమవుతారో, ఎంతమంది పోటీ నుంచి విరమిస్తారో తెలియదు.

కాగా, ఈ సంఘటనపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బనంద సోనోవాల్ విచారణకు ఆదేశించారు. ఈ పరిస్థితి తలెత్తడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

ఇక బధిరుల క్రీడామండలిలో ఆధిపత్య పోరుతో అథ్లెట్లు ఇబ్బందుల పాలవుతున్నారని భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్) డైరెక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ ఆరోపించారు. వసతి ఏర్పాట్ల కోసం తమనెవరూ సంప్రదించలేదని, ఇది ముమ్మాటికి ఆ క్రీడామండలి తప్పిదమేనని శ్రీనివాస్ తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+