సాత్వికకు స్వర్ణం: దక్షిణాసియా క్రీడల్లో 300 పతకాల దిశగా భారత్

హైదరాబాద్: నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. పోటీల్లో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం భారత్ ఏకంగా 42 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 27 స్వర్ణాలు, 12 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 159 స్వర్ణాలు, 91 రజతాలు, 44 కాంస్యాలతో కలిపి మొత్తం 294 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.
సోమవారం టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్స్‌లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో తెలుగమ్మాయిలు సామ సాత్విక, బవిశెట్టి తలపడ్డారు. అయితే, సాత్విక 4-6, 6-2, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో మోచేతి గాయం కారణంగా సౌజన్య వైదొలగడంతో సాత్వికకు స్వర్ణం ఖాయమైంది. పురుషుల సింగిల్స్‌లో సాకేత్ మైనేని రజతం సాధించాడు.

బాక్సింగ్‌లో ఆరు స్వర్ణాలు
మిక్స్‌డ్ డబుల్స్‌లో పసిడి నెగ్గిన సౌజన్య రజతంతో సంతృప్తి పడింది. బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు, ఒక రజతం లభించింది. అంకిత్ ఖటానా (75 కేజీలు), వినోద్ తన్వర్ (49 కేజీలు), సచిన్ సివాచ్ (56 కేజీలు), గౌరవ్ చౌహాన్ (91 కేజీలు), కలైవాని శ్రీనివాసన్ (మహిళల 48 కేజీలు), పర్వీన్ (మహిళల 60 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు.

వరుసగా రెండో స్వర్ణం
పురుషుల ఫొయిల్, మహిళల టీమ్ ఇపీ, మహిళల టీమ్ సాబెర్ విభాగాల్లో మన ఫెన్సర్లు పసిడి గెలిచారు. షూటింగ్ ఎయిర్‌పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లో అనురాజ్, శర్వణ్‌కుమార్ స్వర్ణం నెగ్గగా, భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు వరుసగా రెండో స్వర్ణం నెగ్గింది. ఫైనల్లో 2-0తో నేపాల్‌ను ఓడించింది. బాస్కెట్‌బాల్ పురుషుల, మహిళల జట్లూ స్వర్ణాలు గెలిచాయి.

కబడ్డీలో ఇరు జట్లు స్వర్ణాలు
ఇక, కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లకే స్వర్ణాలు సాధించాయి. పురుషుల ఫైనల్లో భారత్ 51-18తో శ్రీలంకపై విజయం సాధించగా, మహిళల జట్టు 50-13తో నేపాల్‌పై గెలిచాయి. భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఫైనల్లో 2-0తో నేపాల్‌పై నెగ్గి వరుసగా మూడోసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది.

300 పతకాల మైలురాయి కోసం
మంగళవారం క్రీడలకు చివరి రోజు. ఈరోజు కూడా మరికొన్ని ఈవెంట్స్‌లో భారత్ బరిలో ఉండటంతో మన పతకాల సంఖ్య 300 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. 195 పతకాలతో (49 స్వర్ణాలు, 54 రజతాలు, 92 కాంస్యాలు) నేపాల్ రెండో స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications