For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ జోరు.. మరో 29 పతకాలు.. అథ్లెటిక్స్‌లో ఐదు స్వర్ణాలు

South Asian Games: India Win 29 Medals, Including 15 Gold; Jump To Top Of Medal Tally

కఠ్మాండు: దక్షిణాసియా గేమ్స్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పలు ఈవెంట్ల ఫైనల్లో భారత ప్లేయర్లు 29 పతకాలు దక్కించుకున్నారు. టెన్నిస్, టేబుల్‌ టెన్నిస్, ఖోఖో పోటీల్లో భారత మహిళలు, పురుషులు బంగారు పతకాలు సాధించారు. అథ్లెటిక్స్‌లో 10 (5 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), టేబుల్ టెన్నిస్ 6 (3స., 3ర.), తైక్వాండో 6 (3స., 2ర., 1కా.) ట్రైయథ్లాన్‌లో 5 (2స., 2ర., 1కా.), ఖో ఖోలో 2 (2 స్వర్ణాలు) రెండు పతకాలు వచ్చాయి.

టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్లో భారత జోడీలే టైటిల్‌ పోరులో తలపడ్డాయి. దీంతో స్వర్ణాలతో పాటు రజతాలు లభించాయి. టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో హర్మీత్‌ దేశాయ్‌-ఆంథోని అమల్‌రాజ్‌ జోడీ 8-11, 11-7, 11-7, 11-5, 8-11, 12-10తో సానిల్‌ శెట్టి-సుధాన్షు గ్రోవర్‌ జంటపై విజయం సాధించింది. ఇక మహిళల ఫైనల్లో ఆకుల శ్రీజ-మధురిక పాట్కర్‌ జంట 2-11, 11-8, 11-8, 11-6, 5-11, 11-5తో సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ జోడీపై గెలుపొందింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హర్మీత్‌-సుతీర్థ ద్వయం 11-6, 9-11, 11-6, 11-6, 11-8తో అమల్‌రాజ్‌-ఐహిక జంటపై జయకేతనం ఎగురవేశారు.

అథ్లెటిక్స్‌లో 10 పతకాలతో రెచ్చిపోయిన భారత అథ్లెట్లు.. మరోసారి సత్తాచాటారు. మహిళల 200 మీటర్ల విభాగంలో భారత స్ప్రింటర్ అర్చనా సుసీంద్రన్ (23.67 సెకన్లు) గేమ్స్‌లో రెండో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంటే.. ఏ చంద్రలేఖ (24.37 సెకన్లు) కాంస్యంతో సరిపెట్టుకుంది. ఖోఖో పురుషుల ఫైనల్లో భారత్‌ 16-9తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించగా.. మహిళల తుది పోరులో 17-5తో ఆతిథ్య నేపాల్‌ను ఓడించింది.

10 వేల మీటర్ల పురుషుల రేస్‌లో సురేశ్ కుమార్ (29 నిమిషాల 32 సెకన్లు) స్వర్ణాన్ని సాధిస్తే.. లాంగ్ జంప్‌లో లోకేశ్ సత్యనాథన్ (7.87 మీటర్లు), స్వామినాథన్ (7.77మీ.) బంగారు, రజత పతకాలను గెలిచారు. ఇక పురుషుల డిస్కస్‌త్రోలో కృపాల్ సింగ్ (57.88మీ.), గగన్‌దీప్ సింగ్ (53.57మీ.) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మహిళల డిస్కస్‌త్రోలో నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ (49.87మీ.) స్వర్ణం సాధిస్తే.. సుర్వీ బిస్వా (47.47మీ.) వెండి పతకాన్ని గెలిచింది. మహిళల లాంగ్‌జంప్‌లో సంద్రా (6.02 మీటర్లు) కాంస్యం సాధించింది.

బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి, అష్మిత.. పురుషుల సింగిల్స్‌లో సిరిల్‌ వర్మ, ఆర్యమన్‌ టాండన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మొత్తంగా 71 పతకాలతో పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకొచ్చింది.

Story first published: Thursday, December 5, 2019, 8:24 [IST]
Other articles published on Dec 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+