కోల్‌కత్తా: భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు వేదికలను బీసీసీఐ ఆదివారం ఖరారు చేసింది. టీమిండియాతో నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు ట్వంటీ20లు ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు అక్టోబర్ - నవంబర్ మాసాల్లో భారత్‌కు రానుందని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
దక్షిణాఫ్రికాతో సిరిస్‌లో భాగంగా ముందుగా నాలుగు టెస్టుల సిరిస్ ఉంటుందన్నారు. ఈ టెస్టు సిరిస్‌లకు వేదికలను ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, నాగపూర్‌గా ఖరారు చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఇక వన్డేలకు చెన్నై, కాన్పూర్, ఎంపీసీఏ (మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం), రాజ్‌కోట్, ముంబై ఆతిథ్యమివ్వనున్నాయి.
ఇది ఇలా ఉంటే, ట్వంటీ20లకు కోల్‌కతా, మొహాలీ, ధర్మశాల ఆతిథ్యమివ్వనున్నాయి. దక్షిణాఫ్రికా సిరిస్ అనంతరం మూడూ ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక జట్టు ఫిబ్రవరి 2016లో భారత్‌లో పర్యటించనుంది. శ్రీలంకతో జరగనున్న మూడు ట్వంటీ20 మ్యాచ్‌లకు పుణె, విశాఖపట్నం, ఢిల్లీలలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

2016 మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్న వరల్డ్ ట్వంటీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ ఆరు ట్వంటీ20 మ్యాచ్‌లను ఆడించాలని బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
అక్టోబర్ - నవంబర్‌లో ఇండియా Vs దక్షిణాఫ్రికా సిరిస్:
4 Tests - Venues: Ahmedabad, Delhi, Nagpur and Bengaluru
5 ODIs - Chennai, Kanpur, MPCA, Rajkot & Mumbai
3 T20Is - Kolkata, Mohali, Dharamsala
ఫిబ్రవరి 2016లో ఇండియా Vs శ్రీలంక
3 T20Is - Visakhapatnam, Pune, Delhi