For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతి చెత్తగా ఓడిన భారత్: సిరీస్ దక్షిణాఫ్రికా వశం

ముంబై: ఐదో వన్డేలో భారత్ దక్షిణాఫ్రికాపై అతి చెత్తగా ఓటమి పాలైంది. అజింక్యా రహనే, శిఖర్ ధావన్ నిలబడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 214 పరుగుల భారీ తేడాతో భారత్ దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది. భారత్ 35.5 ఓవర్లలో 224 పరుగులు చేసి చేతులెత్తేసింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-2 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా తన ముందు ఉంచిన 439 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే తెగువను భారత్ ఏ స్థితిలోనూ ప్రదర్శించలేకపోయింది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ నాలుగు వికెట్లు తీసుకోగా, స్టెయిన్ 3 వికెట్లు తీసుకున్నాడు.ఇమ్రాన్ తాహిర్ రెండు వికెట్లు, అబోట్ ఒక వికెట్ తీసుకున్నారు.

దక్షిణాఫ్రికా తన ముందు ఉంచిన 439 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 16 పరుగులు చేసి అబోట్ బౌలింగులో ఇమ్రాన్ తాహిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. రబడ బౌలింగులో అద్భుతమైన క్యాచ్‌తో డీకాక్ విరాట్ కోహ్లీని పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో భారత్ 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కోహ్లీ ఏడు పరుగులు మాత్రమే చేశాడు.

కోహ్లీ ఔటైన తర్వాత శిఖర్ ధావన్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అజింక్యా రహనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 156 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడ బౌలింగులో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ పట్టే క్రమంలో ఆమ్లా స్వల్పంగా గాయపడ్డాడు. 172 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడ బౌలింగులో అవుటయ్యాడు.

196 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టెయిన్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్షర పటేల్ ఐదు పరుగులు మాత్రమే చేసి స్టెయిన్ బౌలింగులోనే పెవిలియన్ దారి పట్టాడు. భారత్ ఓటమి దిశగా సాగుతోంది. 210 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఇమ్రాన్ తాహీర్ బౌలింగులో అవుటయ్యాడు. కెప్టెన్ ధోనీ కూడా అవుటయ్యాడు. 219 పరుగుల వద్ద ధోనీ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన తాహిర్ బౌలింగులో ధోనీ స్టంపవుట్ అయ్యాడు.

చివరిదీ ఐదోది అయిన వన్డే మ్యాచులో భారత బౌలర్లకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ముగ్గురు సఫారీలు సెంచరీలు సాధించారు. నాలుగు వికెట్ల నష్టానికి 438 పరుగుల భారీ స్కోరు చేసి భారత్‌కు దక్షిణాఫ్రికా సవాల్ విసిరింది. మిల్లర్ 12 బంతుల్లో 22 పరుగులు, ఎల్గర్ 2 బంతుల్లో ఐదు పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలారు. డీకాక్ (109), డూప్లెసిస్ (133), డివిల్లీర్స్ (119) భారత బౌలర్లను ఏకిపారేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, సురేష్ రైనా తలో వికెట్ తీశారు. విజయానికి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 439 పరుగులు చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డికాక్, హషీం ఆమ్లాలు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. నిలకడగా ఆడుతున్న సమయంలోనే హషీం ఆమ్లా(23 పరుగులు)ను 33 పరుగుల వద్ద మోహిత్ శర్మ ఔట్ చేశాడు.

South Africa going strong despite losing Amla early

ఆ తర్వాత డుప్లిసిస్ మైదానంలోకి అడుగుపెట్టాడు. 109 పరుగులు చేసిన డికాక్.. సురేశ్ రైనా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం డుప్లిసిస్ 123, డివిలియర్స్ 78 పరుగులతో క్రీజులో ఉన్నారు. 43 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 340 పరుగులతో ఆట కొనసాగిస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+