Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్: సిక్స్ బాదిన హీరో క్షమాపణ చెప్పాడు, కారణం ఏమై ఉంటుంది....?

ఆక్లాండ్: ఐసీసీ వరల్డ్ కప్‌లో తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సిక్స్ కొట్టి న్యూజిలాండ్‌ ఫైనల్‌లో అర్హత సాధించేందుక కృషి చేసి గ్రాంట్ ఇలియట్ క్షమాపణ కోరుతున్నాడు. అందుకు కారణం తన సోదరి వివాహానికి హాజరు కాలేకపోవడమే.

వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్ మార్చి 29(ఆదివారం)న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అదే రోజు తన సోదరి వివాహాం జరగతుండటంతో వివాహానికి హాజరు కాలేకపోతున్నానని అందుకు తనని క్షమించాల్సిందిగా కోరాడు.

Six-hitting hero Grant Elliott says sorry, will miss sister's wedding for WC final

ఇక గ్రాండ్ ఇలియట్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్‌లో జన్మించాడు. మార్చి 24(మంగళవారం)న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో డేల్ స్టెయిన్ వేసిన చివరి ఓవర్ ఐదో బంతికి సిక్స్ కొట్టి న్యూజిలాండ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం గ్రాంట్ ఇలియట్ మాట్లాడుతూ గెలుపు సిక్స్ కొట్టినప్పడు నా మదిలో ఎలాంటి ఆలోచన లేదని అన్నారు. అసలు బంతి ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియదని పేర్కొన్నారు. చాలా గొప్పగా ఉంది. ఈ విజయం తన ఒక్కడిదే కాదని, న్యూజిలాండ్‌లోని ప్రతి ఒక్కరిదని అన్నారు. తొలిసారి వరల్డ్ కప్‌లో పైనల్‌కు చేరామని, పైనల్‌ను మరో గొప్ప మ్యాచ్‌లాగే చూస్తామని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాతో మంగళవారం ఆక్లాండ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తద్వారా 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. 1975లో వరల్డ్‌కప్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకూ ఏడుసార్లు సెమీఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+