హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్: ఫైనల్లో చైనా నెంబర్ వన్ చేతిలో సింధు ఓటమి

బెంగళూరు: హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్‌లో పీవీ సింధుకు షాక్ తగిలిగంది. చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ తాయ్ జు యింగ్ చేతిలో ఓడిపోయింది.
18-21, 18-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలయ్యింది.
ఫైనల్‌లో ఓడినప్పటికీ సింధు పోరాట పటిమ ప్రదర్శించింది. తొలి గేమ్‌లో సింధు మొదటి నుంచి వెనుకంజలో ఉన్నప్పటికీ ఒకానొక దశలో ప్రత్యర్థికి గట్టి పోటీ నిచ్చింది.
స్కోరు 11-13 వద్ద ప్రత్యర్థికి రెండు పాయింట్ల దూరంలో నిలిచిన సింధు ఆ తర్వాత 18-18తో సమంగా నిలిచింది. చివర్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో తొలి గేమ్ కోల్పోయింది.
రెండో గేమ్‌లోనూ సింధు గట్టిపోటీని ఇచ్చింది. తొలుత 5-5తో సమంగా నిలిచిన సింధు 9-11తో స్వల్పంగా వెనకబడింది. అయినప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించింది. సైనా నెహ్వాల్, ప్రకాశ్ పదుకొణే తర్వాత హాంకాంగ్ సూపర్ సిరీస్‌ను అందుకోవాలన్న ఆశకు అడుగు దూరంలో నిలిచింది.
Story first published: Sunday, November 26, 2017, 15:33 [IST]
Other articles published on Nov 26, 2017
Read in English: Sindhu goes down to Ying in final
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications