వరల్డ్ జిమ్నాస్టిక్స్ ఛాంయన్‌షిప్: ఆల్‌టైమ్ రికార్డుని సమం బైల్స్

హైదరాబాద్: జర్మనీలోని స్టుట్‌గార్ట్ వేదికగా జరుగుతున్న వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికా స్టార్ జిమ్నాస్టిక్స్ సిమోన్ బైల్స్ అత్యధిక వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాల రికార్డుని సమం చేసింది. శనివారం జరిగిన వాల్ట్ ఫైనల్ ఈవెంట్‌లో 22 ఏళ్ల సిమోన్ బైల్స్ 15.399 పాయింట్లతో విజేతగా నిలిచింది.
ఈ క్రమంలో బైల్స్ ప్రపంచ చాంపియన్ షిప్‌లో 17వ స్వర్ణ పతకాన్ని సాధించింది. మొత్తంగా ఆమెకిది 23వ పతకం. ఈ క్రమంలో అత్యధిక వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలు సాధించిన బెలారస్ జిమ్నాస్ట్ వితాలీ షెర్బో (23 పతకాలు) పేరిట ఉన్న రికార్డును బైల్స్ సమం చేసింది. ఈ టోర్నీలో బైల్స్ మరో రెండు పతకాలు నెగ్గే అవకాశం ఉంది.
కాగా, బెలారస్‌కు చెందిన జిమ్నాస్ట్ వితాలీ షెర్బో 1991 నుంచి 1996 మధ్య జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో 12 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు గెలిచాడు. ఇప్పటివరకు అతడి పేరిట ఉన్న రికార్డుని బైల్స్ సమం చేసింది. చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఫైనల్స్‌లోనూ బైల్స్ పోటీపడనుంది.
ఈ రెండింటిలో ఆమె ఒక్క పతకం సాధించినా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications