హైదరాబాద్: యుఎస్ ఓపెన్‌లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్ చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్‌పై స్టీఫెన్స్ విజయం సాధించి కెరీర్‌లోనే తొలి గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకుంది. శనివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో స్టీఫెన్స్ 15వ సీడ్ క్రీడాకారిణి కీస్‌పై 6-3, 6-0 తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో స్టీఫెన్స్ అన్‌సీడెడ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న 5వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. దీంతో 3.7మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని ఆమె అందుకున్నారు. ఫైనల్స్‌లో తలపడిన కీస్, స్టీఫెన్స్ చిన్ననాటి స్నేహితులు కావడం విశేషం.
2002 తర్వాత ఇద్దరు అమెరికన్ల మధ్య టైటిల్ పోరు జరిగింది. విలియమ్స్ సిస్టర్స్ మధ్య 15 ఏళ్ల క్రితం ఫైనల్ పోరు జరగగా తుదిపోరులో సెరెనా విలియమ్స్... తన సోదరి వీనస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. మాడిసన్ కీస్ మొత్తం 30 అనవసర తప్పిదాలు చేయగా స్లోన్ స్టీఫెన్స్ కేవలం 6తప్పిదాలే చేయడంతో విజయం సులువైంది.

ఈ విజయంతో స్టీఫెన్స్ అన్‌సీడెడ్ ప్లేయర్‌గా మహిళల గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న ఐదో క్రీడాకారిణిగా స్లోన్ స్టీఫెన్స్ గుర్తింపు పొందింది. 24 ఏళ్ల స్టీఫెన్స్ ఆరు వారాల క్రితం 957వ ర్యాంకులో ఉంది. వింబుల్డన్‌లో ఆమె కాలికి గాయం కావడంతో 11 నెలల పాటు ఆటకు దూరమైంది. ఇక 1976 తర్వాత యుఎస్ ఓపెన్ ఫైనల్ గేమ్ త్వరగా ముగియడం ఇదే తొలిసారి.