వరల్డ్ చాంపియన్‌షిప్: వరల్డ్ రికార్డుతో స్వర్ణం నెగ్గిన షూటర్ సౌరభ్

హైదరాబాద్: ఇండియన్ గోల్డెన్ బాయ్, యువ షూటర్ సౌరభ్ చౌదరి చరిత్ర సృష్టించాడు. దక్షిణ కొరియా వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
ఈ క్రమంలో 245.5 పాయింట్లతో జూనియర్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్ చౌదరి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో షూటర్ అర్జున్‌సింగ్ చీమా కాంస్య పతకాన్ని సాధించాడు. అర్జున్ సింగ్ 218 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో స్వర్ణం సాధించిన సౌరభ్ చౌదరిని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సోషల్ మీడియాలో అభినందించారు. ట్యాలెంట్, హార్డ్‌వర్క్‌తో మన కుర్రాళ్లు పతకాలు గెలుస్తున్నారని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
Story first published: Thursday, September 6, 2018, 13:51 [IST]
Other articles published on Sep 6, 2018
Read in English: Shooting: Saurabh Chaudhary bags gold
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications