భారత్‌కు పతకాల పంట పండించనున్న షూటర్లు.. రెజ్లర్లు

జకార్తా: ఆసియా గేమ్స్ రంగం సిద్ధమైంది. మరి కొద్ది రోజుల్లో ఖండాంతర స్థాయిలో మొదలుకానున్న ఈ ఈవెంట్‌లో సత్తా చాటాలని యావత్ ఆసియా క్రీడాకారులు ఆశపడుతున్నారు. కానీ, కొన్ని విభాగాల్లో మాత్రం దాదాపు పతకాలు ఖాయమనే అనిపిస్తోంది. ఇంతకుముందు జరిగిన పోటీల్లో క్రీడాకారులు గెలిచిన పతకాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా షూటింగ్... రెజ్లింగ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నారు.

'భారత షూటింగ్ భవిష్యత్తు భద్రంగా ఉంది.' బింద్రా చెప్పిన ఈ మాటను నిజం చేస్తూ యువ షూటర్లు మను బాకర్, అనీశ్ భన్వాలా, ఎలావెనీల్ వాలరీవాన్ బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో తమదైన ప్రతిభతో సత్తాచాటుతున్నారు. బింద్రా, గగన్ నారంగ్, జీతూరాయ్ వారసులుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ చరిత్ర తిరగరాస్తున్నారు. ఇండోనేషియా వేదికగా శనివారం మొదలయ్యే 18వ ఆసియా క్రీడల్లో భారత్ 36 మంది భారీ బలగంతో బరిలోకి దిగుతోంది. అంచనాలు అందుకుని గురి సరిగ్గా కుదిరితే షూటింగ్‌లో భారత్‌కు తిరుగుండకపోవచ్చు.

పతకాలతో స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్

పతకాలతో స్టార్ రెజ్లర్ సుశీల్‌కుమార్

ముఖ్యంగా ఇటీవలి గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలతో రాణించిన మను బాకరె, అనీశ్, ఎలావెనీల్ కచ్చితంగా పతకం గెలిచే సత్తా ఉన్నవారిలో ముందువరుసలో ఉన్నారు. ఈసారి ఆసియాడ్‌లో షూటింగ్ తర్వాత.. భారత్ అత్యధిక పతకాలు ఆశిస్తోంది రెజ్లింగ్‌లో మొత్తం 18 మంది రెజ్లర్లు ఆసియా క్రీడల్లో తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇందులో 14 మంది కచ్చితంగా తమ విభాగాల్లో పతకాలతో తిరిగి వచ్చే అవకాశముంది. స్టార్ రెజ్లర్లు సుశీల్‌కుమార్, బజ్‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ పోగట్ పసిడి పతకాలను ముద్దాడే అవకాశాలున్నాయి.

ఆసియాడ్‌లో బోణీ కొట్టాలన్న కసితో సాక్షి మాలిక్..

ఆసియాడ్‌లో బోణీ కొట్టాలన్న కసితో సాక్షి మాలిక్..

రియో(2016) ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన సాక్షి మాలిక్..ఆసియాడ్‌లో బోణీ కొట్టాలన్న కసితో ఉన్నది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్‌లో కాంస్యంతో నిరాశపరిచిన ఈ హర్యానా రెజ్లర్..ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకునేందుకు బరిలోకి దిగుతున్నది. మహిళల ఫ్రీైస్టెల్ 62 కిలోల విభాగంలో పోటీపడబోతున్న సాక్షి..ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతున్నది. మరోవైపు గోల్డ్‌కోస్ట్‌లో స్వర్ణంతో మెరుపులు మెరిపించిన వినేశ్ పోగట్(50కి) భారత్ తరఫున గట్టిపోటీదారునిగా కనిపిస్తున్నది.

 ఐదేళ్ల క్రితం అరంగేట్రం చేసిన బజ్‌రంగ్..

ఐదేళ్ల క్రితం అరంగేట్రం చేసిన బజ్‌రంగ్..

భారత రెజ్లింగ్ యువ తరంగం బజ్‌రంగ్ పునియా. ఐదేళ్ల క్రితం జాతీయ రెజ్లింగ్ జట్టులో అరంగేట్రం చేసిన బజ్‌రంగ్.. సీనియర్ రెజ్లర్లకు ఏ మాత్రం తీసిపోకుండా పోటీకి దిగిన ప్రతి టోర్నీలో పతకాలు ఒడిసిపట్టుకున్నాడు. ఆసియాడ్(2014)లో రజత పతకం దక్కించుకున్న ఈ 24 ఏళ్ల హర్యానా రెజ్లర్..ఈ సారి పసిడి పతకం గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు. 65 కిలోల ఫ్రీైస్టెయిల్ విభాగంలో బరిలో ఉన్న బజ్‌రంగ్‌కు అంతగా పోటీనిచ్చే రెజ్లర్లు కనిపించడం లేదు. స్టార్ రెజ్లర్ సుశీల్‌తో సహా బజ్‌రంగ్ గత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోవడంతో ట్రయల్స్‌కు హాజరుకాకుండానే ఆసియా జట్టులో చోటు దక్కించుకున్నారు.

భారత షూటింగ్ భవిష్యత్తుకు దిక్సూచిలా అనీశ్

భారత షూటింగ్ భవిష్యత్తుకు దిక్సూచిలా అనీశ్

భారత షూటింగ్ భవిష్యత్తుకు దిక్సూచిలా అనీశ్ కనిపిస్తున్నాడు. హర్యానాలోని కర్నాల్‌లో 2002లో జన్మించిన అనీశ్..అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. సహజసిద్ధమైన ప్రతిభకు తోడు ఆత్మవిశ్వాసం తోడైతే సాధించలేని ఏది లేదని నిరూపించాడు ఈ 15 ఏండ్ల నూనుగు మీసాల కుర్రాడు. గతేడాది జాతీయ జట్టులోకొచ్చిన అనీశ్..షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 25మీటర్ల పిస్టల్, టీమ్‌ఈవెంట్లలో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్య పతకాలు సాధించాడు. అదే జోరులో ఈయేడాది జరిగిన షూటింగ్ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాలు సహా గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించాడు. 15 ఏండ్లకే పతకం సాధించిన తొలి భారత క్రీడాకారునిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదే రీతిలో ఇండోనేషియాలోనూ ఇరుగదీస్తే..అనీశ్ ఆసియాలో పతక బోణీ కొట్టవచ్చు.

తమిళనాడుకు చెందిన ఎలావెనీల్:

తమిళనాడుకు చెందిన ఎలావెనీల్:

భారత షూటింగ్ తురుపుముక్క ఎలావెనీల్. తమిళనాడుకు చెందిన ఈ 19 ఏళ్ల షూటర్..అద్భుత ప్రతిభకు చిరునామా. ఈ యేడాది జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్‌లో స్వర్ణ పతకంతో ఎలావెనీల్ మెరిసింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంటులో బరిలోకి దిగబోతున్న ఎలావెనీల్..పోడియం ఫినిష్ చేస్తుందన్న గట్టి నమ్మకముంది. వీరిద్దరితో పాటు మిగతావాళ్ల గురికుదిరితే భారత్‌కు పతకాలు వెల్లువెత్తడం ఖాయం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 16, 2018, 12:07 [IST]
Other articles published on Aug 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X