Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షూటింగ్ వరల్డ్ కప్: కాంస్య పతకం సాధించిన జీతూ రాయ్

హైదరాబాద్: ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత ఏస్ షూటర్ జీతూ రాయ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

పైనల్‌లో 216.7 పాయింట్లు సాధించిన జీతూ రాయ్‌కి ఈ టోర్నీలో ఇది రెండో పతకం కావడం విశేషం. ఇక జపాన్‌కు చెందిన తొమయుకి మత్సుద 240.1 పాయింట్లతో వరల్డ్ రికార్డుని నెలకొల్పి స్వర్ణ పతకాన్ని జేజిక్కించుకుంది. 236.6 పాయింట్లతో వియత్నాంకు చెందిన యువాన్ విన్హ్ హోంగ్ రజిత పతకాన్ని సొంతం చేసుకుంది.

Shooter Jitu Rai clinches bronze in 10m air pistol event at ISSF World Cup

ఇక సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో జితూ రాయ్‌, హీనా సిద్ధు జోడీ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. షూటింగ్ వరల్డ్ కప్‌లో మిక్స్ డ్ డబుల్స్ విభాగం పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో మిక్స్‌డ్‌ డబుల్స్‌ను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇది సన్నాహక పోటీయే కావడంతో విజేతలకు పతకాలు అందజేయడం లేదని నిర్వాహకులు ప్రకటించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+