రేపే చివరి రోజు: బింద్రా, దీపికకు నజరానా (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ప్రోపెషనల్ షూటింగ్ నుంచి షూటర్ అభినవ్ బింద్రా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ తన కెరీర్‌లో ఆఖరి పోటీగా పేర్కొన్నాడు. మంగళవారం నాడు ఆసియా గేమ్స్‌లో 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో పాల్గోనున్న అభినవ్ బింద్రా 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు.
షూటింగ్ పోటీ నుండి రిటైర్మెంట్ ప్రకటించడానికి గాను సోషల్ మీడియా ట్విట్టర్‌ను వేదికగా ఎంచుకున్నాడు. "రేపటితో తన క్రీడా జీవితం ముగియనుంది. ఆసియా క్రీడల తర్వాత ప్రొఫెషనల్ షూటింగ్ నుంచి తప్పుకుంటున్నా" అని తెలిపారు. బింద్రా చివరిసారిగా 2016లో జరిగే రియో గేమ్స్‌లో ఉత్తమ ప్రదర్శన చూపించడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ ఏడాది గ్లాస్కోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో బింద్రా బంగారు పతకాన్ని సాధించాడు. 31 ఏళ్ల అభినవ్ బింద్రా ఆసియా గేమ్స్ ముందు వీసా ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 2010 గువాంగ్జులో జరిగిన ఆసియా గేమ్స్‌లో అభినవ్ బింద్రా కాంస్య పతకాన్ని గెలిచాడు.

భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్‌కు కాంస్యం
ఆసియా గేమ్స్‌లో సోమవారం స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్‌కు కాంస్యం అందించింది.

భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్‌కు కాంస్యం
దీపికా మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ పైనల్స్‌లో మలేషియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ నికోల్ డేవిడ్ చేతిలో ఓడింది. 25 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 12 అయిన దీపిక పల్లికల్ 11-4, 11-4, 11-5 తేడాతో నికోల్‌పై ఓడిపోయింది.

భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్‌కు కాంస్యం
ఆసియా గేమ్స్‌లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం సాధించిన దీపిక పల్లికల్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షల నజరానా ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నగదు బహుమతితో పాటు లేఖ ద్వారా అభినందులు తెలిపారు.

భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్‌కు కాంస్యం
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 25 మీటర్ల మహిళల పిస్టల్ టీమ్ విభాగంలో కాంస్య పతకం దక్కింది. టీమ్ ఈవెంట్‌లో హీనా, స్నోబర్, అనీసాలు పతకం సాధించారు. ఇక బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం సాధించింది.
ఆసియా గేమ్స్‌లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం సాధించిన దీపిక పల్లికల్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షల నజరానా ప్రకటించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నగదు బహుమతితో పాటు లేఖ ద్వారా అభినందులు తెలిపారు.
ఈ లేఖలో దీపిక పతకం సాధించడం తమకు గర్వకారణమని, తమిళ ప్రజలు తరుపున హృదయపూర్వకంగా అభినందనలు తెలిపుతున్నానని అన్నారు. ఇక ఆసియా గేమ్స్‌లో భారత జూడో క్రీడాకారులు నిరాశపరిచారు.
ముగ్గురు పురుషులు, ఓ మహిళా జూడోతో కూడిన బృందం పరాజయాన్ని చవిచూసింది. మహిళల 78+ కిలోల విభాగంలో రాజ్విందర్ కౌర్ ఓటమితో చవిచూసింది. కాగా, ఇటీవలే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జూడో జట్టు 6 పతకాలతో సత్తా చాటడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications