హైదరాబాద్: అండర్ - 19 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు సభ్యుడు శివకుమార్ ను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అభినందించారు. తెలుగువాడైన శివకుమార్ ను ముఖ్యమంత్రి సత్కరించారు. శివకుమార్ బుధవారంనాడు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. మలేషియాలోని కౌలాలంపూర్ జరిగిన అండర్ - 19 ప్రపంచ క్రికెట్ కప్ ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
తాము ప్రపంచ కప్ ను గెలుచుకోవడం గర్వంగా, ఆనందంగా ఉందని శివకుమార్ అన్నాడు. మరింత శ్రమ చేసిన భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటానని అతను చెప్పాడు. శివకుమార్ తో పాటు ఆయన తండ్రి రామారావు కూడా ఉన్నారు. ప్రపంచ కప్ గెలుచుకున్న యువ భారత జట్టును, ఆస్ట్రేలియాలో జరిగిన సిబి సిరీస్ ను కైవసం చేసుకున్న భారత వన్డే జట్టును అభినందిస్తూ బుధవారం శాసనసభ తీర్మానం చేసింది.