తనదే తప్పన్న షేన్ వాట్సన్: కోహ్లీ ఆటలో వంకలేదు కానీ.. స్టీవ్ వా
పెర్త్: ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు నుండి తనను పక్కకు పెట్టడానికి తన లోపమే కారణమని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ చెప్పాడు. పరుగులు చెయ్యలేక పోవడం వల్లనే తనను జట్టులోకి తీసుకోలేదని ఆయన చెప్పాడు. తనను జట్టు నుండి తీసేయడంలో.. ఎవరినీ నిందించవలసిన పని లేదని చెప్పాడు.
తాను పరుగులు చేయలేకపోయానని, లోపం తనదేనని చెప్పాడు. అందుకు తనను తానే నిందించుకోవాలన్నాడు. అయితే, తన సామర్థ్యం పైన తనకు నమ్మకం ఉందని చెప్పాడు. అవకాశమొస్తే సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

కోహ్లీకి స్టీవ్ వా హితవు
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆటలో వంక పెట్టడానికి ఏమీ లేదని, అయితే మానసికంగా అతడు ఇంకా కొద్దిగా పరిణితి సాధించాలని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా అన్నాడు. ఈ ప్రపంచంలో విమర్శలు అనేవి కనిపించని బిందువు వంటివన్నాడు. ఈ విషయాన్ని కోహ్లీ త్వరలో తెలుసుకుంటాడని చెప్పాడు. వయసుతో పాటు అతని ప్రవర్తనలో మార్పు వస్తుందని నమ్ముతున్నానని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications