ఏలూరు: పిలుపు వస్తే తాను బీజింగ్ ఓలింపిక్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నానని వెయిట్ లిఫ్టర్ పూజారి శైలజ అన్నారు. తాను స్టాండ్ బైగా ఉన్నాను కాబట్టి తనకు పిలుపు వస్తుందని అనుకుంటున్నట్లు ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మోనికా దేవి డోపింగ్ టెస్టులో పట్టుబడినందును తనకు బీజింగ్ ఓలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. తనకు ఫెడరేషన్ నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన ఆహ్వానం రాలేదని ఆమె చెప్పారు.
తన వల్ల బలి అయ్యానని మోనికా దేవి అనడాన్ని ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూజారి శైలజ అన్నారు. తాను ఎప్పుడు బలి అయ్యానని, మోనికా దేవి ఇప్పుడు తాను బలయ్యానని అంటోందని ఆమె అన్నారు. తాను మోనికా కన్నా ఎక్కువ బరువు ఎత్తానని, అయినా తనను పక్కకు పెట్టి మోనికాను ఓలింపిక్స్ కు ఎంపిక చేశారని, అటువంటప్పుడు మోనికా బలి కావడమెక్కడిదని ఆమె అన్నారు.