అడిలైడ్: క్వార్టర్ ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్ మీద షాక్ తగులుతోంది! ప్రపంచ కప్ నుండి ఏడు అడుగుల ఇర్ఫాన్ ఔట్ అయ్యాడు. తాజాగా షాహిద్ అఫ్రీది పైన సామాజిక అనుసంధాన వేదిక పైన మరో విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సామాజిక అనుసంధాన వేదిక కామెంట్స్, పలు రిపోర్ట్స్ సమాచారం మేరకు... ఐర్లాండుతో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ సమయంలో షాహిద్ అఫ్రీది టీవీ కామెంటేటర్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అడిలైడ్‌లో ఐర్లాండ్ జట్టు పైన పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
తద్వారా పాకిస్తాన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, మ్యాచ్ సమయంలో అఫ్రీది టీవీ కామెంటేటర్ మార్క్ నికోలస్‌ను ఉద్దేశించి 'నిగ్గర్' అని వ్యాఖ్యానించారని చెబుతున్నారు. నిగ్గర్ అంటే.. డిక్షనరీ ప్రకారం అభ్యంతరక వ్యాఖ్యని అని చెబుతున్నారు.
అఫ్రీది అలా మాట్లాడారా లేదా అనే దాని పైన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో తన పైన వెల్లువెత్తుతున్న విమర్శలకు షాహిద్ అప్రీది వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. కాగా, మార్చి 20వ తేదీన క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.