
హైదరాబాద్: భారతదేశ మాజీ బాక్సర్ కౌర్ సింగ్ గుండెనొప్పితో బాధపడుతున్నాడు. అతనికి చికిత్స చేయించాలి. ఈ విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ బాద్ షా గుండె ద్రవించిపోయింది. తన స్వంత టీం అయిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ నుంచి ఐదు లక్షల రూపాయలు అందేలా చేశాడు.
1982 ఆసియా గేమ్స్ స్వర్ణ విజేత అయిన కౌర్ సింగ్ గుండె నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం అయ్యే రెండు లక్షల రూపాయలు లేని పరిస్థితుల్లో సహాయం కోరాడు. దానికి స్పందించిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీం ఐదు లక్షల రూపాయలను సంగ్రూర్‌లోని ఖనల్ ఖర్ద్ అకౌంట్‌కు ఆ నగదును పంపారు.
షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ' క్రీడాకారులు దేశం యెక్క ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేస్తారు. వాళ్లను కాపాడుకోవడం మన విధి. కౌర్ గురించి విన్నాక అందరి నుంచి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంద'ని అభిప్రాయపడ్డారు.
ఖనల్ ఖర్ద్‌లో నివసిస్తున్న సీనియర్ బాక్సర్ అనారోగ్యానికి నెలకు రూ. 8,000 మందులకు ఖర్చు అవుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దీనంగా ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్ కూడా స్పందించి రెండు లక్షల నగదును అక్కడి డిప్యూటి కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. భారతీయ బాక్సింగ్ సమితి కూడా స్పందించి తన వంతుగా లక్ష రూపాయలను పంపింది.
చికిత్స అనంతరం డిసెంబరు 12న పంజాబ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి కౌర్ డిశ్చార్జ్ అయ్యారు. అప్పట్టో భారత బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీతో పాటుగా ఇతను కూడా అనేక పోటీల్లో పాల్గొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.