Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీనియర్ల రిటైర్‌మెంట్ వారి అభీష్టానికే వదిలేద్దాం: దాదా

Indian Team
న్యూఢిల్లీ: ఇండియా మాజీ కెప్టెన్ బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీ మరోసారి సీనియర్లకు అనుకూలంగా మాట్లాడడం జరిగింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి ఆటగాళ్ల రిటైర్మెంట్‌ను వారి ఇష్టానికే వదలాలని, సీనియర్‌ ఆటగాళ్లు తప్పుకోవడానికి ఇది తగిన సమయం కాదని, జట్టు నుంచి వైదొలగాలని వారిని సెలక్టర్లు బలవంత పెట్టకూడదని అభిప్రాయపడ్డాడు.

'తమ ప్రదర్శన తగ్గినప్పుడు వారే స్వయంగా వారియొక్క రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటారు. రాహుల్ ద్రవిడ్‌, లక్ష్మణ్‌ ఇప్పటికే వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోగా సచిన్‌ టెండూల్కర్ మాత్రమే వన్డే క్రికెట్‌ ఆడడం జరుగుతుందని తెలిపాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్లో యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. కానీ టెస్టుల్లో వారి ప్రదర్శన ఆందోళనల కలిగిస్తోంది' అని సౌరభ్ ఓ ప్రముఖ టెలివిజన్ ఛానలో తెలిపాడు.

ఐతే ఇదే సందర్బంలో 1983 ప్రపంచ వరల్డ్ కప్ సాధించిన టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం సౌరభ్ వ్యాఖ్యలతో విభేధించారు. అంతేకాకుండా సెలక్టర్స్ సీనియర్ క్రికెటర్స్‌ని రిటైర్ అవ్వమని ఒత్తడికి గురి చేయలేదని ఆరోపించడం జరిగింది. దీనితో పాటు ఒక టెస్టులో సచిన్‌, లక్ష్మణ్‌, ద్రావిడ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి ఇద్దరిని మాత్రమే ఆడించాలని, వారి స్థానంలో యువ క్రికెటర్లను పరీక్షించాలన్నాడు. ఎక్కువ రిస్క్‌ తీసుకుని యువకులకు అవకాశం ఇవ్వడం ప్రమాదని, ఒక్కసారి మార్పులు చేయడం సరికాదని కపిల్‌ తెలిపాడు. యువ క్రికెటర్ల ప్రదర్శనపై ఫిట్‌నెస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నాడు. అయినా అంతర్జాతీయ వేదికలపై వారికి తగిన అవకాశాలు కల్పించాలన్నాడు.

ఇండియన్ క్రికెట్ చరిత్రలో సచిన్‌, లక్ష్మణ్‌, ద్రావిడ్‌ల స్థానాలు భర్తీ చేయడం అంత సులువు కాదు. కానీ టెస్టుల్లో యువకులు విఫలమైనా మళ్లీ మళ్లీ వారికి అవకాశాలు కల్పించాలి. టెస్టుల్లో యువ క్రికెటర్లు విఫలం కావడం వారి తప్పుకాదు. ప్రస్తుతం కోచ్‌లు, సెలక్టర్ల పాత్రను మరువరాదు. వారి ఫిట్‌లెస్‌ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని మాజీల వాదన 'నేటి క్రీడాకారుల్లో పని నైతికత లోపించింది. వారి ఫిట్‌నెస్‌ స్థాయి పెరగాలి. కోహ్లి, పూజరా, రోహిత్‌లకు మరో అవకాశం ఇవ్వాలి. సురేష్‌ రైనా చాలా అవకాశాలు వృథా చేసుకున్నాడని మదన్‌లాల్‌ తెలిపడం జరిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+