న్యూయార్క్/న్యూఢిల్లీ: గత రాత్రి దీపావళి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బాణసంచా కాలుస్తున్న వేళ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పలు భారత చిత్రాలను తీసిందట.

రాత్రిపూట విద్యుత్ వెలుగులు, టపాకాయల పేలుళ్ల మధ్య భారత్ ఎంతగా ధగధగలాడుతోందో తెలుపుతూ అద్భుతమైన చిత్రాలను నాసా విడుదల చేసిందంటూ.. 'ఇండియా ఎట్ నైట్ డ్యూరింగ్ దివాలీ' క్యాప్షన్‌తో డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ చిత్రాన్ని తన అభిమానుల కోసం ట్వీట్ చేశాడు.
అయితే, ఇది తాజా చిత్రం కాదని, గతంలోనిదని కొందరు పేర్కొంటున్నారు. చిత్రం ఇప్పటిదైనా, పాతదైనా దీపావళి కాంతుల నడుమ భారత్ ఇలానే ఉంటుందని మరికొందరు పేర్కొన్నారు.