హైదరాబాద్: హాలీవుడ్‌లో మొదటి తరం జేమ్స్ బాండ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సీన్ కానరే. జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన సీన్ కానర్ తాజాగా యుఎస్ ఓపెన్‌లో దర్శనమిచ్చాడు. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌కి అతడు హాజరయ్యారు
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆడిన తొలి మ్యాచ్‌ను అతను ఆర్థర్ ఆషె స్టేడియంలో వీఐపీ గ్యాలరీలో కూర్చుని మంగళవారం ప్రత్యక్షంగా చూశాడు. జేమ్స్ బాండ్ 007 థీమ్ సాంగ్‌తో యుఎస్ ఓపెన్ ఆర్గనైజర్లు అతనికి ఘన స్వాగతం పలికారు. స్టేడియంలో 007 థీమ్ సాంగ్‌తో మ్యూజిక్ రాగానే సీన్ కానర్ ముసిముసిగా నవ్వారు.
పెద్ద స్క్రీన్‌పై అతడిని చూడగానే స్టేడియంలో ఉన్న అభిమానులంతా చప్పట్లతో స్వాగతించారు. సీన్ కానర్ 'ఈజ్ ఇన్ ద హౌజ్' అంటూ యుఎస్ ఓపెన్ తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
1962 నుంచి 67 మధ్య కాలంలో వచ్చిన తొలి ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో సీన్ కానరే లీడ్ రోల్ లో నటించాడు. ఆ తర్వాత 1971లో డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అనే బాంబ్ మూవీలోనూ నటించాడు. ప్రస్తుతం 87 ఏళ్ల వయసులోనూ ఇంకా ఫిట్‌గా ఉన్న కానర్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
గతంలో 2012, 2015 యుఎస్ ఓపెన్‌లలోనూ కానర్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. 2006లో యాక్టింగ్ కెరీర్‌కు కానర్ గుడ్ బై చెప్పాడు. బాంబ్ మూవీస్ కాకుండా మరైన్, ద నేమ్ ఆఫ్ ద రోజ్, ఇండియానా జోన్స్, లాస్ట్ క్రూసేడ్‌లాంటి సినిమాల్లో కూడా నటించాడు. ద అన్‌టచబుల్స్ అనే సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డుని అందుకున్నారు.