అపశ్రుతి: నిన్న కాలు విరిగితే ఈరోజు పల్టీలు కొట్టిన సైక్లిస్ట్
రియో డీ జనీరో: బ్రెజిల్‌లో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో మరో అపశృతి చోటు చేసుకుంది. ఆటల్లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా సైక్లిస్ట్ ప్రమాదానికి గురైంది. మహిళల సైక్లింగ్ రేసులో పొల్గొన్న సైక్లిస్ట్ అనెమీక్ వాన్ (33) రేసు పూర్తి చేయడానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైంది.
ఆదివారం కోపకబనా బీచ్‌కు అతి సమీపంలో మలుపులో సైకిల్‌ను టర్నీ తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా అది అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుపూస మూడు చోట్ల విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంపై డచ్ సైక్లింగ్ టీమ్ మేనేజర్ జాన్ లామ్మార్ట్ మాట్లాడుతూ అనెమీక్ వాన్ చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అనెమీక్ వాన్ ప్రమాదానికి గురి కావడంతో ఆమెను దాటేసి అమెరికాకు చెందిన సైక్లిస్ట్ తొలిస్థానంలో నిలిచింది. కాగా, శనివారం జరిగిన పోటీల్లో 2013 యూరోపియన్ ఛాంపియన్, ఫ్రెంచ్ జిమ్నాస్ట్ సమీర్ ఐత్ సయీద్ మోకాలి కింది ఎముక విరిగి పోటీలనుంచి తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications