కామన్ వెల్త్ గ్రామానికి సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: కామన్ వెల్త్ క్రీడాగ్రామానికి సుప్రీంకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. పర్యావరణ శాస్త్రవేత్తలు యమునా నది తీరంలో ఈ క్రీడా గ్రామం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. క్రీడా గ్రామ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. వారి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు క్రీడాగ్రామం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పచౌరీ కమిటీ ఈ క్రీడాగ్రామాన్ని పర్యవేక్షిస్తోంది.
క్రీడాగ్రామం నిర్మాణం పర్యావరణ నిబంధనలకు ఏ మాత్రం విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రీడాగ్రామం యమునా నదీ తీరంలో లేదని, అందువల్ల ఆ ప్రాంత పర్యావరణానికి ఏ మాత్రం విఘాతం కలగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రీడాగ్రామం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఊపిరి సలుపుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications