For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షూటింగ్‌ వరల్డ్‌కప్‌: స్వర్ణంతో మెరిసిన సౌరభ్‌ చౌదరి, మను బాకర్‌ జోడీ

Saurabh, Manu Combine to Shoot Gold in 10m Air Pistol Mixed Event

హైదరాబాద్: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు మెరిశారు. టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్ ఈవెంట్లో సౌరభ్‌ చౌదరి, మను బాకర్‌ జోడీ స్వర్ణ పతకం సాధించారు. గత మూడు రోజులుగా పతకం కోసం వేచిచూస్తున్న భారత్‌కు ఈ జోడీ శుభవార్తను అందించారు.

పైనల్లో వీరిద్దరి జోడీ 483.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా ద్వయం రాన్‌జిన్‌ జియాంగ్‌, బోవెన్‌ జంగ్‌ (477.7) రజత పతకం సొంతం చేసుకోగా, కొరియా జోడీ మిన్‌జుంగ్‌ కిమ్‌, డేహున్‌ పార్క్‌ (418.8) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచ రికార్డును సమం చేస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టిన సౌరభ్‌, మను బాకర్‌ జోడీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.

ఇదే ఈవెంట్‌లో పోటీ పడ్డ మరో భారత జోడీ హీనా సిద్ధు, అభిషేక్‌ వర్మ కనీసం అర్హత రౌండ్‌ని కూడా దాటలేకపోయారు. కాగా, రవికుమార్‌-అంజుమ్‌ జోడీ ఏడో స్థానంలో నిలవగా.. అపూర్వి చండేలా-దీపక్‌ కుమార్‌ జోడీ 25వ స్థానంలో నిలిచారు. తాజా స్వర్ణంతో పాయింట్ల పట్టకిలో భారత్‌ 3 స్వర్ణాలతో హంగేరీతో సమానంగా అగ్రస్థానంలో ఉంది.

ఈ షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు 14 బెర్తులు ఉండగా భారత్‌ కేవలం ఒక్కదాన్నే కైవసం చేసుకుంది.

Story first published: Wednesday, February 27, 2019, 19:24 [IST]
Other articles published on Feb 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+