Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్: రజతంతో సరిపెట్టుకున్న సౌరభ్ చౌదరి

Saurabh Chaudhary settles for silver at Asian Shooting Championship

హైదరాబాద్: 14వ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరి పతకంతో మెరిశాడు. టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు.

పైనల్ పోరులో ఉత్తర కొరియాకు చెందిన కిమ్‌ సాంగ్‌ గుక్‌ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్‌ 221.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మరోవైపు ఇదే 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత షూటర్ అభిషేక్‌ వర్మ కూడా ఐదో స్థానంలో నిలిచాడు.

ఎనిమిది మంది పాల్గొన ఫైనల్లో అభిషేక్‌ 181.5 పాయింట్లు నమోదు చేశాడు. కాగా, సౌరభ్ చౌదరి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో మెరిశాడు. ఇదిలా ఉంటే, సౌరభ్ చౌదరితో పాటు అభిషేక్‌ వర్మ ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తుని ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 11, 2019, 18:13 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+