For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పానిష్ ఓపెన్‌లో స్వర్ణం గెలిచిన సతియాన్‌

By Nageshwara Rao
Sathiyan wins gold in Spain, Manika-Mouma clinch silver

హైదరాబాద్: స్పెయిన్‌లో జరుగుతున్న ఐటీటీఎఫ్ చాలెంజర్ స్పానిష్ ఓపెన్‌లో భారత యువ ఆటగాడు జీ సతియాన్ స్వర్ణం గెలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ సతియాన్‌ 11-7, 3-11, 11-6, 6-11, 13-11, 11-7తో పదకొండో సీడ్‌ యోషిముర (జపాన్‌)ను ఓడించాడు.

ఈ ఏడాదిలో ఒక భారత ఆటగాడు గెలిచిన రెండో ఐటీటీఎఫ్‌ ఛాలెంజ్‌ సిరీస్‌ టైటిల్‌ ఇదే కావడం విశేషం. అంతేకాదు రెండేళ్ల కిందట ఐటీటీఎఫ్ వరల్డ్ టూర్‌లో బంగారు పతకం గెలిచిన తర్వాత సతియాన్‌కు మళ్లీ ఇదే మేజర్ టైటిల్. డబుల్స్‌ ఫైనల్లో మౌమాదాస్‌-మనిక బాత్రా ఓడి రన్నరప్‌గా నిలిచారు.

చెన్నైకి చెందిన సతియాన్ తొలి నాలుగు గేముల్లో మొదటిది 11-7, మూడోది 11-6తో విజయం సాధించగా... యోషిముర రెండో గేమ్‌ను 11-3, నాలుగో గేమ్‌ను 11-6తో నెగ్గాడు. దీంతో వీరిద్దరి మధ్య ఐదో గేమ్ నిర్ణయాత్మకంగా మారింది. ఈ గేమ్‌ను సతియాన్ 11-7తో కైవసం చేసుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 28, 2017, 10:33 [IST]
Other articles published on Nov 28, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+