న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాన్‌ అబ్రహం జట్టుకు గాయాల బెడద: ముంబై సారధి సవాల్

By Pratap

గౌహతి: బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం ఆధ్వర్యంలోని ఐఎస్‌ఎల్‌ ఫ్రాంచైసీకి కొత్త సమస్య వచ్చి పడింది. నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి జట్టులోని ఇద్దరు విదేశీ ఆటగాళ్లు సాషా అనీఫ్‌, ఫాబియో నెవెస్‌ గాయాల బారీన పడ్డారు. దీంతో వచ్చేవారం గౌహతిలో కేరళ బ్లాక్‌ బస్టర్స్‌తో జరిగే ఐఎస్‌ఎల్‌ మూడో ఎడిషన్‌ ప్రారంభ మ్యాచ్‌కు వీరు దూరం కానున్నారు.

ఉరుగ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనీఫ్‌.. డిఫెన్సర్‌ స్పోర్టింగ్‌, రేసింగ్‌ క్లబ్‌ డీ మొంటేవీడియో తరఫున కూడా ఆడాడు. బల్గేరియా, సాల్వేనియా, క్రొయేషియా తదితర దేశాల క్లబ్‌లకూ ప్రాతినిధ్యం వహించిన అనీఫ్‌ సక్సెస్‌ఫుల్‌ క్రీడాకారుడిగా నిలిచాడు. సాల్వేనియా తరఫున రెండు సీజన్లలో 32 మ్యాచ్‌ల్లో తొమ్మిది, క్రొయేషియా నుంచి ఒకసారి ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు గోల్స్‌ చేశాడు.

బ్రెజిలియన్‌ ఆటగాడైన నెవెస్‌ కాల్‌డెన్స్‌, బొటాఫోగో - ఎఫ్‌బి తదితర జట్ల నుంచి ప్రాతినిధ్యం వహించాడు. చివరిగా కొరియా లీగ్‌లో గ్వాంగ్జు ఎఫ్‌సి తరఫున ఆడాడు.

Sasha Aneff and Fabio Neves injuries pile pressure on NorthEast United

జట్టులో ప్రతి ప్లేయర్‌ ఫిట్‌నెస్‌ కీలకం: డియాగో ఫోర్లాన్‌

ముంబై: ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌లో ప్లే ఆఫ్‌కు క్వాలిఫై కావడమే తమ జట్టు ముందు ఉన్న సవాల్‌ అని ముంబై సిటీ ఎఫ్‌సి నూతన సారధి డియాగో ఫోర్లాన్‌ పేర్కొన్నాడు. ఇంతకుముందు అత్యంత వివాదాస్పదంగా మారిన ముంబై సిటీ ఎఫ్‌సి సారధి నికోలస్‌ అనెల్కా స్థానంలో ఫ్రాంచైసీ యాజమాన్యం డియాగో ఫోర్లాన్‌ను నియమించింది. ఉరుగ్వే మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన ఫోర్లాన్‌.. దక్షిణాఫ్రికాలో జరిగిన 2010 ఫిఫా ప్రపంచ కప్‌ టోర్నీలో ఉరుగ్వే జట్టు సెమీస్‌కెళ్లడంలో కీలకభూమిక పోషించాడు.

మంచి జట్టు ఉంటే సరిపోదని, లక్ష్యాల సాధనకు ప్రతి ఆటగాడు, ప్రతి మ్యాచ్‌కోసం ఫిట్‌నెస్‌తో పటిష్ఠ స్థితిలో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. రికార్డుల పరంగా బాగానే ఉండొచ్చుగానీ, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఎప్పుడేమీ జరుగుతుందో ఎవరూ ఊహించలేలేరని ఫ్లోరాన్‌ తెలిపాడు. తమ జట్టు స్వదేశీ, విదేశీ క్రీడాకారుల సమ్మేళనమని చెప్పాడు.

'పలు దేశాల జట్లతో నేను ఆడిన మ్యాచ్‌ల్లో చాలా అనుభవం సంపాదించా. కేవలం కొద్ది కాలంలో మీరు కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే ఆడారు. మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. జట్టులోని సభ్యులు గాయాలు లేకుండా పూర్తిగా ఫిట్‌నెస్‌తో ఉండటం కూడా ముఖ్యమే. రెండు నెలలో మీరు 14 గేమ్స్‌ ఆడాలి. ఐఎస్‌ఎల్‌ భిన్నమైన టోర్నమెంట్‌' అని ఫ్లోరాన్‌ వ్యాఖ్యానించాడు. టోర్నీకి మంచి షెడ్యూల్‌ కూడా ఉంది. నాకు కూడా కొత్త అనుభవం. నాకు పలు ఆఫర్లు వచ్చాయని, కానీ నేను ముంబై సిటీ తరఫున ఆడేందుకే ప్రాధాన్యం ఇచ్చాను' అని ఫోర్లాన్‌ వివరించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X