కోహ్లీ వల్లే, గేల్ పెళ్లికి పిలిచాడు కానీ: సర్ఫరాజ్, డివిల్లీయర్స్ పైన..
ముంబై: విరాట్ కోహ్లీ తన ప్రతిభను గుర్తించి, మరో అవకాశమిచ్చాడని బెంగళూరు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఐపీఎల్ 8 సీజన్లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ అలరించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మ్యాచ్‌లో అతను ధాటిగా ఆడాడు.
తాను తొలి మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరానని, అంతటితో తనకు అవకాశం రాదేమోనని అనుకున్నానని, కానీ కెప్టెన్ కోహ్లీ తనకు మరోసారి అవకాశమిచ్చాడని సర్ఫరాజ్ చెప్పాడు. కోహ్లీ అవకాశం ఇవ్వడం వల్ల తాను నిరూపించుకున్నానని చెప్పాడు. కోహ్లీ తన పైన నమ్మకం ఉంచాడని చెప్పాడు.
సీనియర్ల నుండి తాను చాలా నేర్చుకుంటున్నానని చెప్పాడు. డివిల్లీయర్స్‌తో కలిసి బ్యాట్ చేసే సమయం వచ్చినప్పుడు.. తన కల సాకారమైందని అతనితో చెప్పానని అన్నాడు. జట్టులో ప్రతి ఒక్కరు కలిసి జిమ్‌కు వెళ్తారని, గేల్ మాత్రం సపరేట్‌గా ఉంటాడన్నాడు.

గేల్ ఆటను తాను గమనిస్తానని చెప్పాడు. అతను తనను పాండా అని పిలుస్తాడని చెప్పాడు. గేల్‌కు తాను బెస్ట్ ఫ్రెండ్ అయ్యానని చెప్పాడు. ఎవరైనా లావుగా ఉన్న వారిని చూసినప్పుడు.. సర్ఫరాజ్ నీవు అలా కావొద్దని గేల్ తనకు చెబుతుంటాడని అన్నాడు. అతను తన నవ్వును ఇష్టపడతాడని చెప్పాడు.
వచ్చే నెలలో జమైకాలో జరగనున్న తన పెళ్లికి క్రిస్ గేల్ తనను పిలిచాడని చెప్పాడు. అయితే, తనకు వెళ్లే అవకాశం ఉండదేమో అన్నాడు. నాకు పెద్ద ప్లేయర్ కావాలని ఉందని డివిల్లీయర్స్‌తో చెప్పినప్పుడు.. అతను నీ వయస్సులో నేను నీ దాంట్లో సగం ఆట కూడా ఆడలేకపోయేవాడినని చెప్పాడని చెప్పాడు. టెన్షన్ వద్దని చెప్పాడని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications