
కిట్‌ను ధరించి సానియా డాన్స్:
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకునే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒలంపిక్స్ గేమ్స్‌లో పాల్గొనబోతున్న సానియా.. కొత్త ఇండియన్ ఒలింపిక్ కిట్‌ను ధరించి డాన్స్ చేశారు. అమెరికన్ రాపర్ డోజా క్యాట్‌కు సంబంధించిన హిట్ పాట 'కిస్ మి మోర్'కు బ్లూ కలర్ జెర్సీ ధరించి చిన్నపాటి స్టెప్పులు వేశారు. తెలుగు సీనియర్ కమిడియన్ బ్రహ్మానందం ఓ సినిమాలో నవరసాలు పండించిన తరహాలో సానియా కూడా చేశారు. అందుకు సంబంధించిన పోటోలను ఆమె వీడియోలో పోస్ట్ చేశారు.

అన్ని అందులో ఉన్నాయి:
'నా పేరులో వచ్చే ఇంగ్లీష్ లెటర్ 'ఏ'ను విస్తరిస్తే.. అందులో చాలా జీవితం ఉంది. దూకుడు, ఆశయం, సాధించడం, ఆప్యాయత అన్ని అందులో ఉన్నాయి' అని సానియా మీర్జా కామెంట్ చేశారు. సానియా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పటికే వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను వీక్షించిన పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా స్పందించారు. 'నీ డాన్స్ మూవ్‌మెంట్స్ చాలా నచ్చాయి. నీకు అభినందనలు' అని కామెంట్ చేశారు. టోక్యో ఒలంపిక్స్‌లో ఆడనున్న సానియాకు పలువురు అభిమానులు 'ఆల్ ద బెస్ట్' చెపుతున్నారు.

అంకితా రైనాతో కలిసి బరిలోకి:
కొత్త ఇండియన్ ఒలింపిక్స్ కిట్‌ను భారత ఒలంపిక్స్ అసోషియేషన్ గత నెల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ కిట్‌తో సానియా మీర్జా సందడి చేశారు. ఇక మంగళవారం (జులై 13న) ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సానియా.. టోక్యో ఒలంపిక్స్ కోసం తాను చేస్తున్న సాధన గురించి వివరించారు. పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళల డబుల్స్ విభాగంలో అంకితా రైనాతో కలిసి సానియా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు:
జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళ్లనుంది. అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 85 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఈనెల 17న.. 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరనున్నారు. మిగతా బృందం మరోసారి వెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications
