For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనకంటే రెండేళ్ల చిన్నవాడితో ఒలింపిక్ విజేత సాక్షి ఎంగేజ్మెంట్

By Nageshwara Rao

చంఢీగఢ్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. ఆదివారం హర్యానాలోని రోహ్‌తక్‌లో తన సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్‌తో ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాక్షి మాలిక్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు. కడియన్‌, మాలిక్‌లు కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి ఉన్నారు. కడియన్‌ తో తాను ప్రేమలో ఉన్నానని, త్వరలో వివాహం చేసుకుంటామని సాక్షి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

సీక్రెట్: త్వరలో ప్రియుడితోనే సాక్షి మాలిక్ పెళ్లి!

నిశ్చితార్థం అనంతరం సత్యవర్త్‌ తండ్రి మీడియాతో మాట్లాడారు. ''ఇది ప్రైవేటు కార్యక్రమం. అమ్మాయి, అబ్బాయి తరఫు కుటుంబాలు మాత్రమే నిశ్చితార్థానికి హాజరయ్యాయి'' అని సత్యవర్త్‌ తండ్రి, అర్జున అవార్డు గ్రహీత సత్యవాన్‌ పహిల్వాన్‌ చెప్పాడు.

Sakshi Malik gets engaged to fellow wrestler in Rohtak

ఇదిలా ఉంటే 22 ఏళ్ల సత్యవర్త్‌... సాక్షి కన్నా రెండేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. రెజ్లర్ సత్యవర్త్ రోహ్‌తక్‌లోని తన తండ్రికి చెందిన అఖాడాలో శిక్షణ పొందాడు. 97 కేజీల ఫ్రీస్టరుుల్ కేటగిరీలో బరిలోకి దిగిన సత్యవర్త్ 2010 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించాడు.

టోర్నమెంట్స్‌లో భాగంగా తరచూ ఇద్దరూ కలసుకునేవారు. ఈ సందర్భంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆదివారం సాక్షి స్వగృహంలో ఎంగేజ్‌మెంట్ జరగ్గా పెళ్లి తేదీ మాత్రం ఖరారు కాలేదు. 23ఏళ్ల సాక్షి రియో ఒలింపిక్స్‌లో 58కేజీల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించింది.

సాక్షి మాలిక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాక్షి సాధించిన ఐదు రికార్డులు

1. రియో ఒలింపిక్స్-2016లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణి సాక్షి
2. ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్‌లో భారత్ తరపున తొలి పతకం సాధించిన క్రీడాకారిణి. ఆమె కంటే ముందు ముగ్గురు క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. వీరిలో కేడీ జాద్(1952 హెల్సింకిలో కాంస్యం), సుశీల్ కుమార్(2008 బీజింగ్‌లో కాంస్యం, 2012లండన్‌లో రజతం), యోగేశ్వర్ దత్(2012లండన్‌లో కాంస్యం) ఉన్నారు.
3. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన 4వ మహిళా క్రీడాకారిణిగా సాక్షి రికార్డు సృష్టించారు. మిగితా ముగ్గురురిలో కరణం మల్లేశ్వరి(2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం సాధించింది), మేరీ కోమ్ (2012లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో కాంస్యం), సైనా నెహ్వాల్(2012లండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం) ఉన్నారు.
4. సాక్షి.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే పతకం సాధించడం విశేషం.
5. 23ఏళ్ల అతి తక్కువ వయస్సులో ఒలింపిక్స్ గెలిచిన భారత రెజ్లర్‌గా సాక్షి రికార్డు సృష్టించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+