Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌: ఆశలన్నీ సాక్షి, భజరంగ్‌పైనే

హైదరాబాద్: ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సోమవారం ప్రారంభం కానుంది. పారిస్ వేదికగా జరగనున్న ఈ చాంపియన్‌షిప్‌‌లో భారత్ నుంచి మొత్తం 24 మంది రెజ్లర్లు ఈ మెగా టోర్నీ బరిలో ఉన్నారు. రియో (2016) ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన సాక్షి మాలిక్‌తో పాటు ఆసియా చాంపియన్ భజరంగ్ పూనియాపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది.

ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్ 58కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ ప్రపంచ టోర్నీలో 60కిలోల కేటగిరీ నుంచి పోటీపడనుంది. సాక్షితోపాటు వినేశ్‌ ఫోగట్‌ (48 కేజీలు)పై భారత బృందం ఆశలు పెట్టుకుంది. మరోవైపు బజరంగ్‌ 65 కిలోల విభాగంలో పోటీ పడబోతున్నాడు.

గురువారం సాక్షి తన తొలి బౌట్‌లో తలపడనుంది. ఆసియా టోర్నీలో రజతంతో మెరిసిన వినేశ్ ఫోగట్‌పైనా కూడా అంచనాలున్నాయి. ఇక పురుషుల విభాగానికొస్తే ఆసియా చాంపియన్‌షిప్ 60కిలోల ప్రీ స్టయిల్ విభాగంలో పసిడి పతకం సాధించిన భజరంగ్ తన కేటగిరీని 65కిలోలకు మార్చుకున్నాడు.

Sakshi, Bajrang eye medals at World Wrestling Championships

ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన బజరంగ్‌ 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 60 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం సాధించాడు. ఆసియా అత్యుత్తమ రెజ్లర్లను ఓడించిన ఆత్మవిశ్వాసంలో ఉన్న భజరంగ్.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నాడు.

నిలకడగా రాణిస్తున్న సందీప్ తోమర్(57కి) అవకాశాలనూ కొట్టిపారేయలేమని అంటున్నారు. తొలి రోజు సోమవారం గ్రీకో రోమన్‌ విభాగంలో (71 కేజీలు, 75 కేజీలు, 85 కేజీలు, 98 కేజీలు) పోటీలు జరుగుతాయి.

సోమవారం రాత్రి గం. 10.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం

జట్టు వివరాలు:
పురుషుల ప్రీ స్టయిల్:
సందీప్ తోమర్(57కిలోలు), హర్పుల్(61కి), భజ్‌రంగ్ పూనియా (65కి), అమిత్ ధన్కర్(70కి), ప్రవీణ్ రానా(74కి), దీపక్(86కి), సత్యవర్థ్ కదియాన్(97కి), సుమిత్(125కి).

మహిళల విభాగం: వినేశ్ ఫోగట్(48కిలోలు), శీతల్(53కి), లలిత(55కి), పూజ ధండ(58కి), సాక్షి మాలిక్(60కి), శిల్పి(63కి), నవ్‌జ్యోత్‌కౌర్(69కి), పూజ(75కి).

గ్రీకో-రోమన్: జ్ఞానేందర్(59కిలోలు), రవీందర్ (66కి), యోగేశ్(71కి), గురుప్రీత్(75కి), హర్పీత్(80కి), ఖత్రి(85కి), హర్‌దీప్ (98కి), నవీన్ (130కి).

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: Sakshi, Bajrang eye medals
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+