కామన్వెల్త్ గేమ్స్‌కు సాక్షి మాలిక్, బబితా అర్హత

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్(సీడబ్ల్యూజీ)కు స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బబితా కుమారి అర్హత సాధించారు. లక్నోలోని సాయ్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో ఒలింపిక్ పతక విజేత, భారత మహిళా స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ 62 కిలోల కేటగిరీలో విజయం సాధించి బెర్తు దక్కించుకుంది.
ఆరు వేర్వేరు విభాగాల్లో జరిగిన ఎంపికలో సాక్షి మాలిక్‌తో పాటు బబితా కుమారి (54కేజీలు), వినేశ్ ఫోగట్ (50కేజీలు), పూజ ధండా (57కేజీలు), దివ్య కరణ్ (68కేజీలు), కిరణ్(76కేజీలు) కామన్వెల్త్‌కు ఎంపికైన వారిలో ఉన్నారు. సీడబ్ల్యూజీ 2018 ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 మధ్య ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications