Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paralympics 2024: పతక విజేతగా మారిన సివిల్స్ అభ్యర్థి..ఎవరీ సచిన్?

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 21 పతకాలు చేరాయి. షాట్‌పుట్ ఎఫ్46 విభాగంలో సచిన్ సర్జేరావు ఖిలారీ రజతం సాధించాడు. సచిన్ 16.32 మీటర్లు షాట్ పుట్‌ను విసిరి రెండో స్థానంలో నిలిచి పతకాన్ని సాధించాడు. అయితే సచిన్ క్రీడా ప్రయాణం భిన్నంగా సాగింది. సివిల్స్ కోసం సన్నద్ధమైన అతను పారిస్ వేదికగా పతకాన్ని అందుకునే క్రమంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు.

34 ఏళ్ల సచిన్ సర్జేరావు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని కరగాని గ్రామానికి చెందినవాడు. తొమ్మిదేళ్ల వయస్సులో జరిగిన చిన్న ప్రమాదం సచిన్ జీవితాన్ని మార్చేసింది. సైకిల్‌పై నుంచి కింద పడిన సచిన్‌ ఎడమ చేయి ఫ్రాక్చర్ అయ్యింది. కొన్ని రోజులకే గాంగ్రీన్ అభివృద్ధి చెంది అతని చేతిపై తీవ్ర ప్రభావం చూపించింది. క్రమంగా అది వైకల్యంగా మారింది.

Sachin Khilari From Civil Services Aspirant to Paralympic Silver Medallist

కాగా, సచిన్ చదువుల్లో రాణించేవాడు. తన తండ్రి కోరిక మేరకు పుణెలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అయితే సచిన్ టాలెంట్‌ను మొదట గుర్తించింది పుణె మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియం కోచ్ అరవింద్ చావన్. తొలుత సచిన్‌కు అరవింద్ డిస్క్‌త్రో, జావెలిన్ త్రోలో శిక్షణ ఇచ్చాడు. 2012లో ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ సాధించాడు. ఈ క్రమంలో సచిన్ సాధారణ అథ్లెట్లతో పోటీ పడుతూ ఒత్తిడిని జయించాడు.

2013లో యూపీఎస్సీ, మహారాష్ట్ర స్టేట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. దాదాపు మూడేళ్లకు పైగా ఆటలకు దూరమయ్యాడు. అయితే సివిల్స్ ప్రిపరేషన్‌లో పారాలింపిక్ ఛాంపియన్ జావెలిన్ త్రోవర్ దేవేంద్ర ఝఝరియా గురించి చదివి పారా ఈవెంట్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత 2016 నుంచి పారా క్రీడల్లో పాల్గొంటూ 2017లో పారా నేషనల్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ సాధించాడు.

మరోవైపు ఈ క్రమంలో సచిన్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటి కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచర్‌గా పనిచేశాడు. అయితే భుజానికి గాయం, నేషనల్ కోచ్ సత్యనారాణయ సాయంతో జావెలిన్‌కు బదులుగా షాట్‌పుట్‌లో పోటీపడ్డాడు. అనంతరం రాటుదేలుతూ పతకాలు వేట మొదలుపెట్టాడు. 2022లో ఏషియన్ పారా గేమ్స్‌లో, 2023, 2024లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పసడి సాధించాడు. తాజాగా, విశ్వవేదికపై రజతంతో మెరిశాడు సచిన్ సర్జేరావు ఖిలారీ.

Story first published: Wednesday, September 4, 2024, 20:04 [IST]
Other articles published on Sep 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+