మెల్బోర్న్: హర్బజన్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ జట్టు ఓపెనర్ మాథ్యూ హెడెన్ పై చర్యలు తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా భారత్ కు హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆస్ట్రేలియాబిసిసిఐకి ఒక లేఖ రాశారు. భారత, ఆస్ట్రేలియాల మధ్య ముక్కోణపు వన్డేల్లో భాగంగా ఫైనల్స్ జరగనున్న నేపథ్యంలో హెడెన్ హర్బజన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం భారత్ కు రుచించలేదు. హెడెన్ వ్యాఖ్యలపై చర్చించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో సమావేశమైంది.
క్రికెట్‌లో హర్భజన్ సింగ్ కలుపు మొక్క లాంటి వాడని ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ విమర్శించాడు. హర్భజన్ క్రికెట్ చరిత్ర పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని ఆయన అన్నాడు. హర్భజన్‌కు తనకు చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయని బ్రిస్బేన్‌లో ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్హ్వూలో హేడెన్ తెలిపాడు. తాను తొలిసారి చూసినపుడు హర్భజన్ ఎలా ఉన్నాడో ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాడని హేడెన్ వ్యాఖ్యానించాడు. హర్భజన్ తన తీరు మార్చుకోనందుకే క్రికెట్‌లో అందిరికంటే ఎక్కువసార్లు శిక్షకు గురయ్యాడని హేడెన్ వ్యాఖ్యానించాడు. ఆదివారం సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌ను తాను కవ్వించిన మాట వాస్తవమేనని హేడెన్ అంగీకరించాడు. ఇషాంత్‌ను తనతో బాక్సింగ్‌కు రమ్మంటు పిలిచానని, వయస్సుకు తగ్గట్టు ప్రవర్తించమని సలహా ఇచ్చానని హేడెన్ తెలిపాడు.