Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు

చెన్నై: భారత క్రికెట్ జట్టుతో ఈ నెల 26 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు శనివారం ఉదయం భారత్ చేరుకుంది. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇక్కడికి వచ్చారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆ జట్టు ఆటగాళ్లు హోటల్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే వచ్చే బుధవారం ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు కూడా బ్యాచ్‌‍లవారీగా ఇక్కడకు వస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, జట్టు బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్‌లిద్దరూ గతరాత్రి ఇక్కడకు వచ్చారు.

దక్షిణాఫ్రికా ప్రస్తుత పర్యటనలో భారత్ తో మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటిది చెన్నైలో కాగా రెండో టెస్ట్ అహ్మదాబాద్‌లో వచ్చే నెల 3 నుంచి 7 వరకు జరగనుంది. సిరీస్‌లో మిగిలిన మూడో టెస్ట్ మ్యాచ్‌కు ఏఫ్రిల్ 11 నుంచి 15 వరకు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Story first published: Saturday, March 22, 2008, 14:46 [IST]
Other articles published on Mar 22, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+