Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బికినీలతో వీక్షకులను అలరించనున్న రష్యన్ భామలు

Russian Women’s Soccer Team To Play In Bikinis
ప్రపంచంలో పుట్‌‌బాల్‌కి ఉన్నంత జనాదరణ మరే ఇతర గేమ్‌కి ఉండదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 90 నిమిషాలలో రెండు టీమ్‌లు చేసేటటువంటి గోల్స్ చూడడానికి రెండు కళ్శు చాలవు అంటే నమ్మండి. ఇక పుట్‌‌బాల్ ప్రపంచ కప్ మ్యాచ్‌లకైతే స్పందన ఏ విధంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇదంతా మగవారు పుట్‌‌బాల్ ఆడుతుంటే. సాధారణంగా మగవారి పుట్‌‌బాల్ టీమ్‌కి ఉన్నంత పాపులారిటీ గానీ, జనాదరణగానీ ఆడవారు ఆడేటప్పుడు ఉండదు. ప్రేక్షకులను ఎక్కువ మందిని పుట్‌బాల్ గ్రౌండ్‌కి తెప్పించడం కోసం, గ్రౌండ్ టిక్కెట్లు అమ్ముడవ్వడానికి ఓ రష్యన్ పుట్‌‌బాల్ లేడీ టీమ్ బికినీలతో గేమ్‌ని ఆడనున్నట్లు తెలిపారు.

మాస్కోలోని రోసియాంకా అనే పుట్‌బాల్ లేడీ టీమ్ మెంబర్స్‌ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రీగా పబ్లిసిటీని ఇచ్చుకున్నారు. ఈ సందర్బంలో టీమ్ కోట్ త్యానా ఈగరోవా మాట్లాడుతూ మా పుట్‌బాల్ టీమ్ చాలా ఛాంపియన్స్ షిప్స్ గెలుపోందినప్పటికీ టీమ్ మెంబర్స్ చాలా మందికి తెలియక పోవడంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. రష్యాలో ఉన్నటువంటి బెస్ట్ ఉమెన్స్ టీమ్ మాది. UEFA ఛాంపియన్స్ లీగ్‌కి దేశం ద్వారా మేము మా టీమ్‌ని రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నారు.

దేశంలో చాలా మంది మా టీమ్ గురించి చాలా మందికి తెలియదు. ఎన్ని ఛాంపియన్స్ షిప్స్ కొట్టినా మమ్మల్ని గుర్తించడం లేదు. అందుకే మేము ఇలా బికినీలలో మా తడాఖా చూపించి మాకు మంచి గుర్తింపుని తెచ్చుకోవాలని ఇలా చేస్తున్నాం అని అన్నారు. టీమ్‌లో ఉన్నటువంటి మా ప్లేయర్స్ అందరూ కూడా చాలా అందంగా ఉన్నారు. మంచి ఎద్లెట్లు ఉండేది గెలుపొందడానికేనని అన్నారు. సో ఇలా బికినీలలో గేమ్ ఆడుతున్నారని తెలుసుకున్న పుట్‌బాల్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియంలో ఉన్న టిక్కెట్లకు కూడా మంచి గిరాకీ లభించింది. త్వరలో జరగనున్న ఈ మ్యాచ్‌లో మన భామలు అభిమానులను ఎలా అలరించనున్నారో చూద్దాం...
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+