పాపం పవర్ లిఫ్టర్.. బరువెత్తే ప్రయత్నంలో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు! (వీడియో)

మాస్కో : వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లో ఓ రష్యన్ పవర్ లిఫ్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వందలు, మూడు వందలు కాదు.. ఏకంగా 400 కిలోల బరువెత్తే ప్రయత్నంలో విఫలమై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మాస్కోలో వేదికగా జరిగిన ఈ వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అలెగ్జాండర్‌ సెడిఖ్‌ స్క్వాట్‌లో అంత భారీ మొత్తాన్ని కాళ్లు వణుకుతుండగా అతికష్టమ్మీద భుజాల వరకు ఎత్తాడు. ఆపై బరువును తట్టుకోలేక కుప్పకూలాడు.

అదృష్టవశాత్తు 'బార్బెల్‌' వెనక్కి పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే సెడిఖ్‌ రెండు మోకాళ్లు విరగ్గా..తొడ కండరాలు కూడా దెబ్బతిన్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు దాదాపు 6 గంటలపాటు శ్రమించి అతడి కాళ్లకు శస్త్రచికిత్స చేశారు. విరిగిపోయిన రెండు కాళ్ల ఎముకలతో పాటు చీలిపోయిన తొడ కండరాలనూ అతికించారు.

ఈ ప్రమాదంతో అలెగ్జాండర్‌ రెండు నెలలపాటు మంచానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యాలో 2019లో వరల్డ్‌ రా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 20 ఏళ్ల రడోస్కేవిచ్‌ మూడో ప్రయత్నంలో 250 కేజీల బరువెత్తబోయి గాయపడి కెరీర్‌కు స్వస్తిపలకాల్సి వచ్చింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 14, 2020, 11:54 [IST]
Other articles published on Aug 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X