వాడా నాలుగేళ్ల నిషేధంపై సవాల్ చేసిన రుసాడ

హైదరాబాద్: వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా తమపై అంతర్జాతీయ డోపింగ్ సంస్థ (వాడా) విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని రష్యా సవాల్ చేసింది. నిషేధంపై అప్పీల్ చేసుకునేందుకు రష్యాకు వాడా 21 రోజుల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డోపింగ్ నిరోధక సంస్థ (రుసాడ) పలు ఆధారాలతో ఓ నివేదికను వాడాకు పంపింది.
ఇందులో తమపై విధించిన నిషేధాన్ని నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. నిషేధంపై రుసాడ అప్పీల్ చేయడంతో ఈ విషయం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు చేరనుంది. దీనిపై రుసాడా డైరెక్టర్ యూరీ గనస్ మాట్లాడుతూ "ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను వాడాకు సమర్పించాం. ఆంక్షలను విభేదిస్తున్నామని అందులో పేర్కొన్నాం" అని అన్నారు.
2020 టోక్యో ఒలింపిక్స్, 2022 వింటర్ ఒలింపిక్స్ సహా మరే ప్రపంచపోటీల్లో పాల్గొనకుండా రష్యాపై వాడా నాలుగేళ్లు నిషేధం విధించింది. డోపింగ్ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మాస్కో ప్రయోగశాలకు సంబంధించి తప్పుడు వివరాలను ఇచ్చినందుకు వాడా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నాలుగేళ్లు నిషేధం విధించాలన్న సమీక్ష కమిటీ ప్రతిపాదనను ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంఘం (వాడా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. 2011-15 కాలంలో ప్రభుత్వమే డోపింగ్‌ను ప్రోత్సహించిందని మెక్‌లారెన్ స్వతంత్ర నివేదిక 2016లో బయటపెట్టిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications