సోమర్‌సెట్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించిన గేల్

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్ క్రిస్ గేల్ కళ్లు చెదిరే శుభారంభం అందించాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన గేల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అతనికి దిల్షాన్ 16 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌తో 23, కోహ్లి 22 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్స్‌తో 33 పరుగులు అండగా నిలిచారు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గేల్ 31 బంతుల్లోనే 4ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 46 బంతుల్లో 8సిక్సర్లు, 4ఫోర్లతో 86 పరుగులు చేసి థామస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గేల్ వీరవిహారంతో బెంగళూరు స్కోరు 206కు చేరింది. సోమర్‌సెట్ బౌలర్లలో కిర్బి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించాడు. వాన్‌డీర్వ్‌మెర్వె (6), కైస్ వెట్టెర్ (26)లు ఎనిమిది పరుగుల తేడాతో ఔటైన తర్వాత ట్రెగొ, హిల్‌డ్రెత్ మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ హిల్‌డ్రెత్ 15 పరుగుల చేసి వెనుతిరిగాడు. సోమర్‌సెట్ 9.5 ఓవర్లలో వంద పరుగులు చేసింది. ట్రెగొ 31 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఓవర్ ఓవర్‌కు రన్‌రెట్ కొండలా పెరగడంతో సోమర్‌సెట్ ఒత్తిడి గురయింది. బట్లర్ (4), ట్రెగొ (58), సుప్పయ్య (15)లు ఔట్ కావడంతో సోమర్‌సెట్ 20 ఓవర్లలో 155 పరుగులు చేసి విజయానికి 51 పరుగుల దూరంలో నిలిచింది. బెంగళూరు బౌలర్లలో వెటోరీ, అరవింద్, నానెస్ పొదుపుగా బౌలింగ్ చేశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications