న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిఫా ఆపర్: 'గెలిస్తే.. ఆమెకు నా భర్తను వారం ఇస్తా'

By Srinivas

రియో డి జనీరో: ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో అర్జెంటీనా జట్టు గెలిస్తే తన భర్తను అమెరికన్ పాప్ స్టార్ రిహన్నాకు వారం రోజులు అరువుగా ఇస్తానని అర్జెంటీనా గోల్ కీపర్ రొమెరో భార్య ఎలియానా గెర్సియో ఆఫర్ చేశారు. గతంలో భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా పరుగెడతానంటూ బాలీవుడ్ పూనంపాండే ప్రకటించగా, ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన బాలికల్ని విడిచిపెడితే తాను వారితో గడిపేందుకు సిద్ధమని, రోజుకు ఆరుగురైనా పర్లేదని ఓ పాప్ సింగర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా వారి జాబితాలో అర్జెంటీనా గోల్ కీపర్ సెర్గియో రొమెరో భార్య ఎలియానా చేరింది. అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకుంటే తన భర్తను వారం రోజుల పాటు పాప్ సింగర్ రిహన్నాకి కి అరువుగా ఇస్తానని చెప్పింది.

Romero's wife ready to loan him if Argentina win

సెమీ ఫైనల్ లో నెదర్లాండ్స్ ఆటగాళ్ల ఫ్రీ కిక్‌లను గోల్ కాకుండా రొమెరో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సెమీస్‌ను చూసిన పాప్ సింగర్ రిహన్నా అతగాడి ఆట తీరుపై ముచ్చటపడి, అతడ్ని ప్రశంసలతో ముంచెత్తింది. దీంతో రొమెరో భార్య ఎలియానా అర్జెంటీనా గెలిస్తే రిహన్నాకు వారం రోజుల పాటు తన భర్తను అప్పిస్తానని ట్వీట్ చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X