
హైదరాబాద్: పూణెకు చెందిన లాంగ్ డిస్టెన్స్ స్విమ్మర్ రోహన్ మోరె విదేశీ గడ్డపై సముద్రాన్ని ఈదడంలో రికార్డు విజయాన్ని నమోదు చేశాడు. న్యూజిలాండ్‌లోని నార్త్, సౌత్ ద్వీపాలను కలుపుతూ వెళ్లే కుక్ స్ట్రీట్‌ను అతను 8 గంటలా 37 నిమిషాల్లో ఈదాడు. దీంతో ఈ పోటీని పూర్తి చేసిన అతి తక్కువ వయసు గల తొలి ఆసియన్‌గా చరిత్ర సృష్టించాడు.
వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా రోజులు వేచి చూసిన మోరె ఫిబ్రవరి 9న ఎట్టకేలకు సముద్రాన్ని ఈదేందుకు పూనుకున్నాడు. రోహన్ ఈదే క్రమంలో తొలి ఐదు గంటలు 19 డిగ్రీల సెల్సియ్‌సగా ఉన్న నీటి ఉష్ణోగ్రత.. దక్షిణ ద్వీపం చేరేకొద్దీ 4 డిగ్రీలకు పడిపోయింది. అయినా, ఏమాత్రం వెరవకుండా రోహన్ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీని పూర్తి చేసిన తొమ్మిదో వ్యక్తిగా మోరె రికార్డు సృష్టించాడు. అంతేకాదు కుక్ జలసంధిని ఈదిన తొలి ఆసియావాసిగా రోహన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల వయసులోనే మోరె తన తొలి మారథాన్ స్విమ్‌ను పూర్తి చేయడం విశేషం.
2014-16 మధ్య కాలంలో రోహన్ పూర్తి చేసిన స్విమ్స్ ఇవే:
* English Channel (13 hours and 23 minutes),
* North Channel (12 hours and 43 minutes),
* Catalina Channel (10 hours and 17 minutes),
* Molokai Channel (17 hours and 28 minutes),
* Tsugaru Strait (10 hours and 37 minutes),
* Gibraltar Strait (3 hours and 56 minutes).
ఇండియన్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ నుంచి రోహన్ మోరె టెన్జింగ్ నార్వే అవార్డుని కూడా అందుకున్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రోహన్ మోరె ఈ అవార్డుని అందుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.