రోచ్ హ్యాట్రిక్, నెదర్లాండ్‌పై 215 పరుగులతో వెస్టిండీస్ ఘన విజయం

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వెస్టిండీస్‌కు గేల్, స్మిత్ శుభారంభాన్నందించారు. స్మిత్ చెలరేగి ఎడాపెడా బౌండరీలు బాదితే గేల్ చాలా నెమ్మదిగా ఆడాడు. బుఖారి వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన స్మిత్ ఆ తర్వాత వెస్ట్‌జిక్ వేసిన ఓ ఓవర్లో రెండు, మరో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. ఐతే గేల్ 24వ బంతికి గానీ తొలి బౌండరీ సాధించలేకపోయాడు. ఎట్టకేలకు డస్కాటె ఓవర్లో తొలి ఫోర్ కొట్టిన గేల్.. ఆ ఓవర్లో మరో రెండు బంతులను బౌండరీ దాటించాడు. తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. అదే జోరును కొనసాగిస్తాడనుకుంటే.. మళ్లీ జోరు తగ్గించాడు. 17వ ఓవర్లో స్మిత్ ఔట్ కావడంతో 100 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన డారెన్ బ్రావో (30) ఆత్మవిశ్వాసంతో ఆడాడు. గేల్‌తో 88 పరుగులు జోడించి ఔటయ్యాడు. 37వ ఓవర్లో బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకోవడంతో గేల్ చెలరేగుతాడనిపించింది. కానీ తొలి బంతికే అతడు ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 196.
గేల్ నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన మెరుపు వీరుడు పొలార్డ్ తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించాడు. విధ్వంసక విన్యాసాలతో రెచ్చిపోయాడు. సీలార్ వేసిన మూడు వేరు వేరు ఓవర్లలో మూడు సిక్స్‌లు బాదిన పొలార్డ్.. బుఖారి వేసిన ఒక ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మరోవైపు శర్వాణ్ (49; 42 బంతుల్లో 7X4, 1X6) కూడా ఫోర్లతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పొలార్డ్ చివరికి 48వ ఓవర్లో ఔటయ్యాడు. అతడు కేవలం 24 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడం విశేషం ప్రపంచకప్‌లో ఇది మూడో వేగవంతమైన అర్ధశతకం. పొలార్డ్ కంటే ముందు శర్వాణ్, సామి, చందర్‌పాల్ ఔటయ్యారు. బ్యాటింగ్ పవర్ ప్లేలో విండీస్‌కు 56 పరుగులొచ్చాయి. చివరి 10 ఓవర్లలో విండీస్ 91 పరుగులు రాబట్టింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications