Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌ చేతికి రజితం

Rivzis silver opens Indias account at ISSF World Cup

హైదరాబాద్: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో వరుసగా తొలి రెండు రోజులు విఫలమైన భారత షూటర్లు మూడో రోజు బోణీ చేశారు. 87 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో రిజ్వీ 582 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో మంగళవారం 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో రిజ్వి రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు.

గత నెలలో మెక్సికోలో జరిగిన ప్రపంచక్‌పలో తొలి ప్రయత్నంలోనే స్వర్ణం సాధించిన రిజ్వి ఇక్కడ 0.2 పాయింట్ల తేడాతో స్వర్ణాన్ని మిస్సయ్యాడు. రిజ్వి 239.8 పాయింట్లతో రజతం సాధించగా, రష్యాకు చెందిన ఆర్టెమ్‌ చెర్నోసొవ్‌ 240 పాయింట్లతో స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.

బల్గేరియాకు చెందిన సాముల్‌ డొంకొవ్‌ 217.1 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు. ఆరో ఉత్తమ షూటర్‌గా ఫైనల్స్‌కు చేరుకున్న రిజ్వి రజతంతో ముగించాడు. మరోవైపు కామన్వెల్త్‌ స్వర్ణ పతక విజేత జీతు రాయ్‌ జీతురాయ్(575), ఓం ప్రకాశ్ మితర్వాల్(581) వరుసగా 38, 11 స్థానాల్లో నిలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించలేకపోయారు.

టాప్‌-8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందుతారు. పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లో భారత షూటర్లెవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మానవ్‌జిత్‌ (117 పాయింట్లు), కైనన్‌ షెనాయ్‌ (115 పాయింట్లు), జొరావర్‌ సింగ్‌ (114 పాయింట్లు) వరుసగా 24, 36, 41వ స్థానాల్లో నిలిచారు.

Story first published: Wednesday, April 25, 2018, 10:08 [IST]
Other articles published on Apr 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+