Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతా సిద్ధం: మరి కొన్ని గంటల్లో రియో ఒలింపిక్స్, ప్రత్యేకతలివే

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ మరి కొన్ని గంటల్లో ఆరంభం కానున్నాయి. సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం రియో ఒలింపిక్స్ నిర్వహించడానికి హక్కులు దక్కించుకున్న బ్రెజిల్ అప్పటి నుంచి ఎన్నో వివాదాలను అడ్డుకుని ప్రపంచపు అతి పెద్ద క్రీడా పండుగను నిర్వహించేందుకు సిద్ధమైంది.

దక్షిణ అమెరికా ఖండం తొలి సారి ఆతిథ్యమిస్తున్న ఈ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారమే మొదలు కానున్నాయి. రియోలోని ఒలింపిక్ గ్రామంలో నిర్మించిన ప్రఖ్యాత మరకానా స్టేడియంలో (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.30 గంటలకు) ప్రారంభ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ విశ్వ క్రీడలను బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే ఒలింపిక జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తాడు. రియో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో బ్రెజిల్ సాంప్రదాయాలను ప్రతిబంభిస్తూ నిర్వహకులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. బ్రెజిల్ ఆర్ధిక మాంద్యంలో ఉన్నప్పటికీ, దేశ చరిత్రను, రియో ప్రకృతి సోయగాలను తెలిపేలా వేడుకలను నిర్వహించనుంది.

రియో ఒలింపిక్స్‌లో మొత్తం 206 దేశాలు పాల్గొంటున్నాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకూ రియో ఒలింపిక్స్ జరగనున్నాయి. భారత్ తరుపు నుంచి రియో ఒలింపిక్స్‌లో మొత్తం 118 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒలింపిక్ ఆరంభ వేడుకలు ముగిసిన అనంతరం పోటీలు ప్రారంభమవుతాయి.

రియో ఒలింపిక్స్ లోగో

రియో ఒలింపిక్స్ లోగో

ముగ్గురు వ్యక్తులు చేతులు కలుపుతున్నట్టు రియో ఒలింపిక్స్‌ లోగోను రూపొందించారు. లోగోలోని పసుపు రంగు సూర్యుడిని, బ్రెజిల్‌ వాసుల సుహృద్భావాన్నీ సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు అడవులకూ, సానుకూల ఆలోచనా ధోరణికీ చిహ్నం. నీలం రంగు నీటికీ, ప్రజల పారదర్శక స్వభావానికీ గుర్తు.

రియో ఒలింపిక్‌ టార్చ్‌

రియో ఒలింపిక్‌ టార్చ్‌

ఒలింపిక్‌ గేమ్స్‌ జ్యోతి ప్రజ్వలనతోనే మొదలవుతాయి. అందుకే ఒలింపిక్‌ టార్చ్‌ ఎంతో ప్రా ముఖ్యతను సంతరించుకుంది. రియో ఒలింపిక్‌ టార్చ్‌ను అనేక విశేషాల మేళవింపుగా రూపొందించారు. ఇందులో నాలుగు భాగాలుంటాయి. పైన బంగారు వర్ణంలో మెరిసిపోయే భాగం ఆకాశానికి, స్వర్ణ పతకానికి ప్రతీక. దానికింద ఉన్న హరిత వర్ణం బ్రెజిల్‌లోని సహజసిద్ధమైన ప్రకృతి సంపదకూ, పచ్చటి పర్వతాలకూ చిహ్నం. నీలం రంగు ఉన్న భాగం రియో సముద్ర తీరానికి గుర్తు. ఆఖరున ఉన్న భాగం రియోలో బాగా ప్రాచుర్యం పొందిన పాదచారుల మార్గాన్ని సూచిస్తుంది

రియో మస్కట్‌

రియో మస్కట్‌

రియో ఒలింపిక్స్‌ అధికారిక మస్కట్‌ వినిషియస్‌. ప్రజలు ఓటింగ్‌ ద్వారా బ్రెజిల్‌లోని ఓ ప్రముఖ కవి పేరునే దీనికి పెట్టారు. పిల్లి, కోతి, కుక్క వంటి జంతువులతోపాటు వివిధ పక్షుల కలయికగా కనిపించే ఈ బొమ్మ బ్రెజిల్‌ జీవ వైవిధ్యానికి ప్రతీకగా భావిస్తారు.

రియో ఒలింపిక్స్‌లో ఆటగాళ్లకు ఇచ్చే పతకం

రియో ఒలింపిక్స్‌లో ఆటగాళ్లకు ఇచ్చే పతకం

రియో ఒలింపిక్స్‌ విజేతలకు ఇచ్చే పతకాలకు ఓవైపు విజయానికి ప్రతీకగా భావించే గ్రీకు దేవత బొమ్మ, మరోవైపు గ్రీస్‌లో విజేతలకు ఇచ్చే లారెల్‌ ఆకులను ముద్రించారు. ఈ రెండింటి మధ్యలో రియో ఒలింపిక్స్‌ లోగో ఉంటుంది.

రియో ఒలింపిక్స్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రతిష్టాత్మక ఈ ఈవెంట్‌ కోసం ఇప్పటికే రియోలో ఓ ఒలింపిక్ గ్రామాన్ని నిర్మించారు. అంతేకాదు 85 వేల మంది మిలటరీ, పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రదాడులు, ఆందోళనకారులను అదుపులో ఉంచేందుకు లండన్‌ ఒలింపిక్స్‌తో పోల్చితే భద్రతను రెండింతలు పెంచారు.

కాగా ప్రపంచంలో అత్యధిక నేరాల జాబితాలో బ్రెజిల్ 11వ స్థానంలో ఉంది. రియోలో ఇంత భద్రత కల్పించినప్పటికీ, స్థానికులు విదేశీ ఆటగాళ్ల పట్ల చోరీలకు పాల్పడుతున్నారు. భద్రత కూడా సరిపోవడం లేదు. క్రీడాగ్రామానికి వచ్చిన చైనా, ఆస్ట్రేలియా, డెన్మార్క్‌ క్రీడాకారులు తమ వస్తువులు దొంగతనానికి గురైనట్టు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

మరోవైపు రియో ఒలింపిక్స్‌ను రష్యా డోపింగ్ కుంభకోణం తాకిన నేపథ్యంలో రష్యాకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఆటగాళ్లు పూర్తిగా దూరమయ్యారు. రియో ఒలింపిక్స్‌కు ఉసేన్‌ బోల్ట్‌ ప్రత్యేకంగా నిలవనున్నారు. 100 మీ, 200 మీ, 4X100 మీ. రిలేలో స్వర్ణాలను నిలబెట్టుకునేందుకు జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ హైలైట్‌గా మారారు.

అదే విధంగా, తొలివారంలో ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌పై అందరి కళ్లూ ఉండనున్నాయి. అమెరికా బంగారు చేప... మైకేల్‌ పెల్ఫ్స్‌ తన కెరీర్‌కు అద్భుతమైన వీడ్కోలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 18 స్వర్ణాలు సహా 22 పతకాలతో ఒలింపిక్స్‌లో అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా పేరొందిన పెల్ఫ్స్‌ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక ఆతిథ్య దేశ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ నెమార్‌ బ్రెజిల్‌కు తొలి ఒలింపిక్‌ స్వర్ణం అందించాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+