రియోకు నర్సింగ్ ఆశలు గల్లంతు: ఆహారంలో డ్రగ్స్, కుట్ర ఎవరిది?
మరోవైపు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సోనేపట్ సెంటర్లో నిర్వహిస్తున్న కేంద్రంలో నర్సింగ్ బస చేసిన సమయంలో, ఆయన గదికి పంపిన ఆహారంలో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి పంపినట్లుగా చెబుతున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు.
ఆహారంలో డ్రన్స్ కలిపిన వ్యక్తిని గుర్తించామన్నారు. అతను సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న రెజ్లర్ సోదరుడన్నారు. ఉత్ప్రేరకాలను కలపడానికి సాయ్ సెంటర్‌లో వంటవాడిగా పని చేస్తున్న వ్యక్తి కూడా సహకరించారని తెలిపారు. ఈ మేరకు సాక్ష్యాలు లభించాయన్నారు.
ఈ వ్యక్తి జూనియర్ లెవల్‌లో 65 కిలోల రెజ్లింగ్ విభాగంలో దేశం తరపున ఆడాడని, అప్పుడప్పుడూ సోనేపట్ సెంటర్‌కు స్పేరింగ్ పార్ట్‌నర్‌గా ఉంటుండేవాడని భూషణ్ సింగ్ తెలిపాడు. కేడీ జాదవ్ హాస్టల్లోని నర్సింగ్ రూం తాళాలను అతను అడిగి తీసుకున్నాడన్నారు.
ఇక్కడ ఏం పని అని ఇతర ఆటగాళ్లు అతనిని అడగగా, పొరపాటున వచ్చానని చెప్పాడన్నారు. కాగా, 74 కిలోల విభాగంలో నర్సింగ్ పోటీ పడాల్సి ఉండగా, రియోకు బయలుదేరే సమయంలో డ్రగ్స్ వాడినట్టు రుజువు కావడంతో ఆయన ప్రయాణం ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కావాలనే కుట్ర పన్ని నర్సింగ్ యాదవ్‌ను ఇరికించారన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా నర్సింగ్ యాదవ్ స్థానంలో ప్రవీణ్ రాణాకు అవకాశం ఉండవచ్చునని అంటున్నారు.
రెండోసారి విఫలం
నర్సింగా యాదవ్ రెండోసారి కూడా డోప్ టెస్టులో విఫలమయ్యాడు. తద్వారా అతని రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయనే చెప్పవచ్చు. మరోవైపు, నర్సింగ్ సోదరుడు వినోద్ యాదవ్ మాట్లాడుతూ.. కుట్ర వెనుక సుశీల్ కుమార్ ఉన్నాడని ఆరోపించారు.

నర్సింగ్ యాదవ్
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో రెజ్లర్ నర్సింగ్‌యాదవ్ విఫలమైన విషయం తెలిసిందే.

నర్సింగ్ యాదవ్
అతడి నుంచి తీసుకున్న 'ఏ' నమూనాతో పాటూ 'బి' నమూనాలోనూ నిషేధిత మిథేనడైనన్ అనే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ పరీక్షల అనంతరం తేల్చి చెప్పారు.

నర్సింగ్ యాదవ్
మరోవైపు, తనపై కుట్ర జరిగిందని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. తాను ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలను తీసుకోలేదని స్పష్టం చేశాడు.

నర్సింగ్ యాదవ్
తాను బాగానే పర్ఫార్మ్ చేస్తున్నట్లు చెప్పిన రెజ్లర్ తనకు నిషేధిత ఉత్ర్పేరకాలు వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఆహారంలో కానీ నీటిలో కానీ ఎవరో ఏదైనా కలిపి ఇచ్చి ఉంటారని నర్సింగ్ మొదటి నుంచి చెబుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications