న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్, ఐదు సార్లు ప్రపంచం ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ ఒలింపిక్ ఆశలు మళ్లీ చిగురించాయి. రియోలో జరిగే ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను వైల్డ్ కార్ట్ ద్వారా రియో ఒలింపిక్స్‌కు పంపించాలని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌ను భారత్ కోరనుంది.
ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు మే నెలలో కజకిస్థాన్‌లోని అస్తానాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ రెండో రౌండ్‌లో వెనుదిరిగింది. దీంతో ఆమె రియో బెర్త్‌కు అర్హత కోల్పోయింది. నిజానికి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే సెమీస్ వరకు చేరాలి. కానీ మేరీ కోమ్ రెండో రోండ్లోనే ఓటమి పాలైంది.
ఈ నేపథ్యంలో ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీ పద్ధతి ద్వారా రియో ఒలింపిక్స్‌కు పంపించాలని భారత బాక్సింగ్ సమాఖ్య భావిస్తోంది. 'మేరీకోమ్ అద్భుతమైన అథ్లెట్. బాక్సింగ్‌కు ఎంతో కొంత సేవ చేయాలని ఆమె చూస్తోంది. ఆమె కోసం వైల్డ్‌కార్డ్ కోరాలని మేము నిర్ణయం తీసుకున్నాం. దరఖాస్తులన్నీ పరిశీలించాకే అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది' అని భారత బాక్సింగ్ తాత్కాలిక కమిటీ ఛైర్మన్ కిషెన్ నర్సి తెలిపారు.

ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో ఆమెను 'మాగ్నిఫిసెంట్ మేరీ'గా అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య సంబోధిస్తోంది. మరి భారత్ తాజా నిర్ణయంతో ఏ నిర్ణయం తీసుకుంటో చూడాలి మరి.
మరోవైపు మేరీ కోమ్ కూడా రియో ఒలింపిక్స్‌లో గట్టి ఆశలనే పెట్టుకుంది. చివరిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించాలనే ఆశయంతో ఉన్న మేరీకోమ్ వైల్డ్‌కార్డ్‌పై ఎంట్రీపై స్పందిస్తూ 'ఏం జరుగుతుందో చూద్దాం' అని తెలిపింది. ఇప్పటి వరకు భారత్ తరుపున శివ తాపా (56 కేజీలు) విభాగంలో రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏకైక బాక్సర్.