ఎదురుదెబ్బ: రియోలో రష్యన్ అథ్లెట్లపై నిషేధం
లాసన్నే: తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ 68 మంది రష్యా అథ్లెట్లు దాఖలు చేసిన పిటిషన్ అంతర్జాతీయ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ కొట్టివేసింది. గతంలో రష్యా ప్రభుత్వ సాయంతో నిర్వహించిన డోపింగ్‌లో నిందితులుగా తేలిన వారిపై ఐఏఏఎఫ్, అథ్లెటిక్స్ గవర్నెంగ్ బాడీలు నిషేధం విధించింది.
దీనిన సవాల్ చేస్తూ 68 మంది అథ్లెట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. కాస్ తీర్పును ఐఏఏఎఫ్ స్వాగతించింది. అథ్లెట్స్ పాటించాల్సిన విలువలను పరిరక్షించడంలో ఐఏఏఎఫ్‌కు ఉన్న హక్కుకు ఈ తీర్పు బలాన్నిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది.

రియోలో రష్యన్ అథ్లెట్లపై నిషేధం
క్రీడలపై నమ్మకాన్ని, గౌరవాన్ని, పోటీ తత్వాన్ని పెంపొందించే విధంగా ఈ తీర్పు ఉందని పేర్కొంది. ఈ తీర్పుపై ఐఏఏఎఫ్ ప్రెసిడెంట్ లార్డ్ కో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నిబంధనలను, నిబంధనలు అమలు చేయడానికి మాకున్న హక్కును యాంటీ డోపింగ్ చట్టానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

రియోలో రష్యన్ అథ్లెట్లపై నిషేధం
రష్యా అథ్లెట్లకు మంచి వాతావరణం కల్పించేందుకు ఆ దేశంతో కలిసి మరింత కృషి చేస్తామని ఆయన అన్నారు. ఇదిలాఉంటే ఈ తీర్పు నేపథ్యంలో రష్యాపై పూర్తిగా నిషేధం విధించాలని చూస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)కు మంచి అవకాశం లభించింది.

రియోలో రష్యన్ అథ్లెట్లపై నిషేధం
ఆదివారం జరిగే ఐవోసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానంతరం రష్యాపై పూర్తిస్థాయి నిషేధం విషయమై ఓ ప్రకటన చేయనున్నట్టు ఐవోసీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉంటే తాజా పరిణామాలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాస్ తీర్పును రాజకీయంగా ప్రభావితం చేశారని, చట్ట విరుద్ధమని రష్యా క్రీడామంత్రి విచాలి ముట్కో ఆరోపించారు.

రియోలో రష్యన్ అథ్లెట్లపై నిషేధం
ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో రష్యాలాంటి దేశం లేకపోతే విశ్వక్రీడలు కళ తప్పే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యా అథ్లెట్లపై నిషేధం విధించడాన్ని ఉసేన్ బోల్ట్ హర్షం వ్యక్తం చేశాడు. ‘ఈ నిర్ణయం ప్రతి ఒక్కరికీ గట్టి హెచ్చరికలు పంపుతుంద'ని అన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అమెరికా తర్వాత రష్యానే అత్యధిక పతకాలు సాధించింది. కానీ డోపింగ్‌లో రష్యా అథ్లెట్లు పట్టుబడడంతో చాలా మంది తమ పతకాలు కోల్పోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications