వీడని సస్పెన్స్: రియో ఒలింపిక్స్‌కు రెజ్లర్ నర్సింగ్ యాదవ్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పాల్గొనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. డోపింగ్ స్కాంపై గురువారం సుదీర్ఘ వాదనలు విన్న జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) తుది తీర్పును వాయిదా వేసింది. శనివారం లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.
ప్రత్యర్థుల కుట్ర వల్లే తాను డోపీగా తేలానని, తనకు తెలియకుండానే ఆహార పదార్థాల్లో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపారని నర్సింగ్ ఆరోపిస్తూ నాడా కమిటీ ఎదుట 600 పేజీల అఫిడవిట్ దాఖలు చేశాడు. దీనిపై నాడా లీగల్ టీమ్ కూడా తమ వాదనలు వినిపించింది.

వీడని సస్పెన్స్: రియో ఒలింపిక్స్‌కు రెజ్లర్ నర్సింగ్ యాదవ్
దీనికి సంబంధించి రెండు రోజుల పాటు నాడా క్రమశిక్షణ ప్యానెల్ ముందు వాదనలు వినిపించారు. సరైన ఆధారాలు చూపెట్టనందున నర్సింగ్‌పై నిషేధం విధించాలని చెప్పింది. ‘వాదనలు ముగిశాయి. శనివారం లేదా సోమవారం తీర్పు రానుంద'ని నాడా లాయర్ గౌరంగ్ కాంత గురువారం విలేకరులతో చెప్పారు.

వీడని సస్పెన్స్: రియో ఒలింపిక్స్‌కు రెజ్లర్ నర్సింగ్ యాదవ్
దీంతో పాటు తనపై కుట్ర జరిగిందనడానికి తగిన సాక్ష్యాలను నర్సింగ్ సమర్పించలేదని ఆయన వాదించినట్టుగా చెప్పారు. ‘రెజ్లర్ తాను ఎటువంటి తప్పూ చేయలేదని నిరూపించడంలో విఫలమయ్యాడు. నిషేధిత ఉత్ప్రేరకాలు తన శరీరంలోకి ఎలా వచ్చాయో చెప్పలేదు. అతను తప్పు చేయలేదని నిరూపించలేకపోయాడు కాబటి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు కాంత తెలిపారు.

వీడని సస్పెన్స్: రియో ఒలింపిక్స్‌కు రెజ్లర్ నర్సింగ్ యాదవ్
రెండో రోజు విచారణకు హాజరైన నర్సింగ్ యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. నాడా తనకు అనుకూలంగా తీర్పునిచ్చే అవకాశం ఉందని రెజ్లర్ నర్సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకు రియో ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశం ఉందని, అందుకే ఇంకా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నట్టు చెప్పాడు.

వీడని సస్పెన్స్: రియో ఒలింపిక్స్‌కు రెజ్లర్ నర్సింగ్ యాదవ్
డోపింగ్ నుంచి నర్సింగ్ బయటపడితే.. పర్వీణ్ రాణా స్థానంలో అతడిని రియోకు పంపడానికి ఎటువంటి ఇబ్బందీ లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తెలిపింది. నర్సింగ్ డోప్‌లో పట్టుబడడంతో అతడి స్థానంలో పర్వీణ్ రాణాను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications